మావోయిస్టుల ఏరివేతకు ప్రత్యేక అధికారి | special officer for Maoist operations | Sakshi
Sakshi News home page

మావోయిస్టుల ఏరివేతకు ప్రత్యేక అధికారి

Published Thu, Nov 3 2016 2:26 AM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM

special officer for Maoist operations

భద్రాచలం కేంద్రంగా ప్రత్యేక కార్యాలయం.. కేంద్రం నిర్ణయం
మల్కన్ గిరి: మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల మధ్య సమన్వయం పెంపొందించడంతో పాటు ఆపరేషన్ల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం ఓ సీనియర్ ఐపీఎస్ అధికారిని నియమించనుంది. ఇందుకోసం తెలంగాణలోని భద్రాచలం కేంద్రంగా ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలైన ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లలో మావోల ఏరివేతకు ఆయా రాష్ట్రాలను ఐపీఎస్ అధికారి సమన్వయపరచనున్నారు.

ఆయా రాష్ట్రాల మధ్య ఇంటెలిజెన్ ్స సమాచారం పరస్పరం పంచుకోవడంలో ఆ కార్యాలయం చొరవ చూపనుంది. అలాగే అటవీ ప్రాంతంలో రూ. కోట్ల ఖర్చుతో అత్యంత అధునాతన వెబ్ కెమెరాలను కేంద్రం ఏర్పాటు చేయనుంది. హెలికాప్టర్‌లో ఏరియల్ సర్వే నిర్వహించేందుకు వీలు కల్పించనుంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్, దంతెవాడ, బస్తర్, కొండగాం, రాంకీ జిల్లాలు, మహారాష్ట్ర సరిహద్దులోని నారాయణపూర్, తెలంగాణలోని ఖమ్మం, ఏపీలోని విశాఖ రూరల్, చింతపల్లి, పశ్చిమగోదావరి జిల్లాలోని మోతిగూడెం, రంపచోడవరం, ఒడిశాలోని మల్కన్ గిరి, కొరాపుట్ జిల్లాలు ఈ కార్యాలయ పరిధిలో ఉంటాయని తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement