ఎస్‌ఎస్‌సీ గ్రాడ్యుయేట్ లెవల్ పరీక్ష వాయిదా | Staff Selection Commission postpones Combined Graduate Level Examination-2014 | Sakshi
Sakshi News home page

ఎస్‌ఎస్‌సీ గ్రాడ్యుయేట్ లెవల్ పరీక్ష వాయిదా

Published Mon, Apr 7 2014 2:27 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

Staff Selection Commission postpones Combined Graduate Level Examination-2014

న్యూఢిల్లీ: కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ పరీక్ష-2014ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) వాయిదా వేసింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 27, మే 4న జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు, తిరిగి ఎప్పుడు నిర్వహించేదీ తర్వాత తెలియజేస్తామని ఎస్‌ఎస్‌సీ  వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో గ్రూప్ బి, సి పోస్టుల భర్తీ కోసం ఎస్‌ఎస్‌సీ ఈ పరీక్ష నిర్వహిస్తూ ఉంటుంది.
 
 లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ మే 16వరకు కొనసాగనున్న విషయం తెలిసిందే. ఇక, ఎన్నికల అనంతరం కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ పరీక్ష-2013ను ఎస్‌ఎస్‌సీ ఏడు కేంద్రాల్లో తిరిగి నిర్వహించనుంది. గతేడాది లక్నో, పాట్నా, అలహాబాద్, ఢిల్లీ, జైపూర్, సిమ్లా, డెహ్రాడూన్ కేంద్రాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో తిరిగి అక్కడ పరీక్ష నిర్వహించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement