నరేంద్ర మోడీ భజన ఆపండి | Stop praising Narendra Modi, Kerala Congress tells Shashi Tharoor | Sakshi
Sakshi News home page

నరేంద్ర మోడీ భజన ఆపండి

Published Mon, Oct 6 2014 3:19 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

నరేంద్ర మోడీ భజన ఆపండి - Sakshi

నరేంద్ర మోడీ భజన ఆపండి

తిరువనంతపురం: కేంద్ర మాజీ మంత్రి, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసించడాన్ని కేరళ కాంగ్రెస్ నాయకులకు కోపం తెప్పించింది. నరేంద్ర మోడీని పొగడటం మానుకోవాలని థరూర్కు సూచించారు. నరేంద్ర మోడీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి థరూర్ మద్దతు తెలిపి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా మోడీ ఆహ్వనించగా, థరూర్  అంగీకరిస్తూ ట్వీట్ చేశారు.

థరూర్ వ్యవహారశైలిపై కేరళ కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. స్వచ్ఛ భారత్ ప్రారంభం రోజు గాక థరూర్ కొంతకాలంగా మోడీ జపం చేస్తున్నారని విమర్శించారు. థరూర్ ఎందుకిలా చేస్తున్నారో అర్థం కావడం లేదని కేరళ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు హసన్ అన్నారు. ఈ అంశాన్ని జాతీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement