ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ లోని గగ్సాపూర్ ప్రాంతంలో పాలిటెక్నిక్ విద్యార్థి అభిషక్ తలపై తుపాకీతో కాల్చుకుని మృతి చెందాడు.
లక్నో: ఢిల్లీలో క్యాబ్ డ్రైవర్ పై ఇద్దరు టీనేజర్లు కాల్పులు జరిపిన ఘటన మరువకముందే మరో విద్యార్ధి చేతిలో తుపాకీ పేలింది. ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ లోని గగ్సాపూర్ ప్రాంతంలో పాలిటెక్నిక్ విద్యార్థి అభిషేక్ తలపై తుపాకీతో కాల్చుకుని మృతి చెందాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీలోని చిల్లూర్ గ్రామానికి చెందిన అభిషేక్ (22) మొరాదాబాద్ లో పాలిటెక్నిక్ చదువుతున్నాడు. శుక్రవారం స్నేహితుని ఇంటికి వచ్చిన అభిషేక్ ఢిల్లీలో ఉంటున్న తన అన్నయ్యతో ఫోన్ లో గొడవపడ్డాడు. తర్వాత కొద్ది సేపటికే తన కారు డోర్ లాక్ చేసుకుని తుపాకీతో కాల్చుకుని అత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు సూసైడ్ కేసుగా నమోదు చేసి విచారిస్తున్నారు. విద్యార్థికి తుపాకి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియాల్పి ఉంది.