ఈసారి రైల్వే బడ్జెట్ పై | sudarsan pattnaik sand art on railway budget | Sakshi
Sakshi News home page

ఈసారి రైల్వే బడ్జెట్ పై

Published Thu, Feb 25 2016 2:37 PM | Last Updated on Sun, Sep 3 2017 6:25 PM

ఈసారి రైల్వే బడ్జెట్ పై

ఈసారి రైల్వే బడ్జెట్ పై

భువనేశ్వర్: 2016 సంవత్సరానికి గాను మంత్రి సురేశ్ ప్రభు ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ మాట ఎలా ఉన్నా.. ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ మాత్రం పలువురి ఆకట్టుకున్నారు. వివిధ సందర్భాలలో  సైకత శిల్పాలతో  ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఆయన మరోసారి తన నైపుణ్యానికి పని చెప్పారు.

సురేష్ ప్రభు రైల్వే బడ్జెట్‌పై ఇసుకతో చక్కటి శిల్పాన్ని తయారుచేశారు. ఒడిశాలో పూరీ సముద్రతీరంలో పట్టాలు, రైలును ఇసుకతో చెక్కారు. దాని పక్కన ఇండియన్ లైఫ్ లైన్ బడ్జెట్ 2016 అని క్యాప్షన్ రాశారు.  అనంతరం దీన్ని ట్విట్టర్ లో  పోస్ట్ చేశారు. సమాజంలో ఆయా పరిస్థితులకు,  పరిణామాలకు సందర్భోచితంగా విలక్షణ శైలిలో సైకత శిల్పాలను రూపొందించడం సుదర్శన్ పట్నాయక్ ప్రత్యేకత.  ఇటీవల  మంచుపర్వతాల్లో చిక్కుకున్న హనుమంతప్ప  కోమాలోకి వెళ్లిన సందర్భంలో త్వరగా కోలుకోవాలంటూ తన సైకత  శిల్పం ద్వారా ఆకాక్షించి పలువురి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement