సాక్షి,న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల వేతన పెంపుకు రంగం సిద్ధమైంది. వేతన పెంపు ప్రతిపాదనకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. వేతన పెంపుకు సంబంధించిన బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెడతామని న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల వేతనాలు పెంచాలని 2016లో అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ ప్రభుత్వానికి లేఖ రాశారు.
ప్రస్తుతం సుప్రీం కోర్టు జడ్జి అన్ని డిడక్షన్స్ మినహాయించిన అనంతరం నెలకు రూ 1.5 లక్షలు వేతనం అందుకుంటున్నారు. ఈ మొత్తం కంటే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అధికంగా స్వీకరిస్తుంటే, హైకోర్టు న్యాయమూర్తులకు అంతకంటే తక్కువ వేతనం లభిస్తోంది.
సర్వీసులో ఉన్నంతవరకూ న్యాయమూర్తులకు అద్దె లేకుండా వసతి సౌకర్యం కల్పిస్తారు.ఏడవ వేతన కమిషన్ సిఫార్సుల నేపథ్యంలో న్యాయమూర్తుల వేతన పెంపు ప్రభుత్వ పరిశీలనలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment