'ఆ లాయర్ కు భద్రత కల్పించండి' | Supreme Court asks Delhi Police chief to ensure no harm is done to Lawyer | Sakshi
Sakshi News home page

'ఆ లాయర్ కు భద్రత కల్పించండి'

Published Mon, Jan 18 2016 2:21 PM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

Supreme Court asks Delhi Police chief to ensure no harm is done to Lawyer

న్యూఢిల్లీ: కేరళలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శబరిమలలో మహిళల ప్రవేశాన్ని నిషేధించడాన్ని సవాల్ చేసిన న్యాయవాదికి రక్షణ కల్పించాలని ఢిల్లీ పోలీసులను సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. ఆయనకు భద్రత కల్పించేందుకు ఏ చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని ఢిల్లీ  పోలీసు చీఫ్ ను కోరింది. ఆయనకు ఎటువంటి ముప్పు వాటిల్లకుండా చూడాలని సూచించింది.

తమ సభ్యులకు ఫోన్లు వస్తున్నాయంటూ ఢిల్లిలోని ఇండియన్ యంగ్ లాయర్స్ అసొసియేషన్ కు చెందిన ఓ మహిళా సభ్యురాలు పిల్ దాఖలు చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు స్పందించింది. శబరిమలలోని అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశం నిషేధంపై ఇండియన్ యంగ్ లాయర్స్ అసొసియేషన్.. సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement