న్యూఢిల్లీ: గో రక్షక గ్రూపులపై నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్ నేపథ్యంలో.. రాజస్థాన్ సహా ఆరు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. దీనిపై సమాధానమివ్వాలంటూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
ఈ మేరకు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఎ.ఎం.ఖన్విల్కర్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. నోటీసులు జారీ చేసిన రాష్ట్రాల్లో రాజస్థాన్ , మహారాష్ట్ర, గుజరాత్, జార్ఖండ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. సమాధానమిచ్చేందుకు ధర్మాసనం మూడు వారాల గడువు ఇచ్చింది. తదుపరి విచారణను మే మూడోతేదీకి వాయిదా వేసింది.