‘ఆధార్ తప్పనిసరి’పై స్టేకు సుప్రీం నిరాకరణ
న్యూఢిల్లీ: కేంద్రానికి సుప్రీంకోర్టులో ఉపశమనం లభించింది. పలు సంక్షేమ పథకాలకు ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్రం ఇచ్చిన ప్రకటనలపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. ఆధార్‌కు సంబంధించిన అన్ని పిటిషన్లను విడివిడిగా కాకుండా జూన్ 27న ఒకేసారి విచారిస్తామని జస్టిస్ ఖాన్వీల్కర్ నేతృత్వంలోని బెంచ్ స్పష్టం చేసింది. బాలల హక్కుల రక్షణ కమిషన్ మాజీ చైర్‌పర్సన్ శాంతా సిన్హా దాఖలు చేసిన పిటిషన్ విచారణను వాయిదా వేస్తూ కోర్టు పైవిధంగా స్పందించింది.
ఉపకార వేతనాలు, సర్వశిక్షా అభియాన్, మధ్యాహ్న భోజన పథకం లాంటి వాటికి ఆధార్ వివరాలను తప్పనిసరిగా సవర్పించడానికి నిర్దేశించిన గడువును జూన్ 30 తరువాత పొడిగించే యోచన ప్రభుత్వానికి లేదని అటార్నీ జనరల్ రోహత్గీ సుప్రీంకోర్టుకు తేల్చి చెప్పారు.