సాక్షి, కోల్‌కతా : ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానుండటంపై బిహార్ డిప్యూటీ సీఎం, సీనియర్ బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలంటే అందాల పోటీ కాదని వ్యాఖ్యానించారు. గత సామర్ధ్యం ఆధారంగానే ఓటర్లు ఓట్లు వేస్తారని, ఎన్నికలంటే రెజ్లింగ్ పోటీలో..అందాల పోటీలో కాదని అన్నారు. ఎన్నికలంటే రాజకీయ పోరాటమని, రాజకీయ పోటీలో నేతల గత సామర్ధ్యం ప్రాతిపదికన ఓటర్లు ఓట్లు వేస్తారని ఆయన చెప్పుకొచ్చారు.
సీనియర్ నేత, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ప్రధాని చేసేందుకు గాంధీ కుటుంబం అనుమతించలేదని ఆరోపించారు. ప్రణబ్ ముఖర్జీ తన జీవితంలో ఎన్నడూ బీజేపీ నేతగా లేకున్నా ఆయనకు అత్యున్నత భారత రత్న పురస్కారం ప్రకటించడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీకి సుశీల్ మోదీ కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు ప్రియాంకపై బీజేపీ నేతల విమర్శలను కాంగ్రెస్ తోసిపుచ్చింది. ప్రియాంకను చూసి బీజేపీ నేతలు భయపడుతున్నారని, అందుకే ఆమెపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని రాజ్యసభ ఎంపీ, బిహార్ కాంగ్రెస్ మాజీ చీఫ్ ప్రదీప్ భట్టాచార్య అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment