
అత్యవసరంగా దిగిన సిడ్నీ-దుబాయ్ విమానం
ముంబయి: ఆర్థిక రాజధాని ముంబయి విమానాశ్రయంలో దుబాయ్కు చెందిన విమానాన్ని అత్యవసరంగా దించివేశారు. ప్రయాణీకుల్లోని ఇద్దరికి అస్వస్థత తలెత్తడంతో ఉన్నపలంగా ల్యాండింగ్ చేశారు. సిడ్నీ నుంచి దుబాయ్కు ఎయిర్ బస్ 380 బయలు దేరి వెళుతుండగా ఇద్దరు వ్యక్తుల తమకు ఛాతిలో నొప్పి ఉందని చెప్పడంతో అప్పటికప్పుడు ముంబయి విమానాశ్రయ అధికారులను సంప్రదించి అనుమతులు పొంది దించేశారు. అనంతరం ఆ ప్రయాణీకులనిద్దరినీ ముంబయిలోని ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.