'రూ. 41 వేలు తీసుకుని.. రేప్ మర్చిపో' | Take Rs.41,000, forget rape: Panchayat tells victim | Sakshi
Sakshi News home page

'రూ. 41 వేలు తీసుకుని.. రేప్ మర్చిపో'

Published Sat, Jan 31 2015 1:27 PM | Last Updated on Sat, Jul 28 2018 8:51 PM

'రూ. 41 వేలు తీసుకుని.. రేప్ మర్చిపో' - Sakshi

'రూ. 41 వేలు తీసుకుని.. రేప్ మర్చిపో'

ఓ దళిత మహిళ శీలానికి 41 వేల రూపాయిలు ఖరీదు కట్టారు.

పాట్నా: ఓ దళిత మహిళ శీలానికి 41 వేల రూపాయిలు ఖరీదు కట్టారు. ఈ డబ్బులు తీసుకుని అత్యాచార ఘటనను మరచిపోవాలని, పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని పంచాయతీ పెద్దలు బాధితురాలిని ఆదేశించారు. బీహార్లోని కటిహర్ జిల్లా కోదా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది.

అయితే నిందితుడు బాధితురాలికి డబ్బు ఇచ్చేందుకు నిరాకరించాడు. దీనిపై బాధితురాలు నిరసన వ్యక్తం చేయగా, నిందితుడు ఆమె భర్తకు నిప్పంటించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు  కటిహర్ జిల్లా ఎస్పీ క్షత్రనీల్ సింగ్ విచారణకు ఆదేశించారు. ఇటీవల పనికో్సం పంచాయతీ కార్యాలయానికి వెళ్లినపుడు ప్రకాశ్ అనే వ్యక్తి అత్యాచారం చేసినట్టు చెప్పింది. ఈ కేసులో నరేష్ రవిదాస్ అనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, ప్రధాన నిందితుడు ప్రకాశ్ పరారీలో ఉన్నాడు. బీహార్లోనే నలుగురు అన్నదమ్ములు ఓ బాలికపై అత్యాచారం చేసిన ఘటనలో పంచాయతీ పెద్దలు బాధితురాలికి 50 వేల రూపాయలు ఇవ్వాల్సిందిగా ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement