
సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో మరోసారి చర్చించాల్సిన అవసరం లేదని సీడబ్ల్యూసీ సమావేశంలో ఉన్నతాధికారులు వ్యాఖ్యానించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ప్రాజెక్టుల నిర్మాణంపై సీడబ్ల్యూసీ అధికారులు ఆయా రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులతో మంగళవారం ఢిల్లీలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.
దీనికి తెలంగాణ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు ఈసీ హరిరాం హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, అనుమతులపై అధికారులు సమీక్షించారు. ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించిన సీడబ్ల్యూసీ అధికారులు పనుల తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రాజెక్టుపై మరోసారి చర్చ అవసరం లేదని అధికారులు వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment