చెన్నై: డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముద్రితమైన తరగతి పాఠ్య పుస్తకాల్లో మూడు లక్షల పుస్తకాల కాలం చెల్లి పోవడంతో వాటిని ఆ రాష్ట్ర విద్యా విభాగం తాజాగా తిరిగి వెనక్కు తెప్పించింది. ఆ సమయంలో ప్రభుత్వం తొమ్మిదో తరగతి విద్యార్ధులకు ఇచ్చిన పుస్తకాల ముందుమాటలో ఆనాటి సీఎం కరుణానిధి పేరే ఇప్పటికీ ముద్రించి ఉండటమే.
దీంతో ఈ విషయాన్ని గ్రహించిన విద్యాశాఖ ఆ పుస్తకాలను తిరిగి వెనక్కు తెప్పించింది. అయితే ఇది ప్రింటింగ్ తప్పిదం కాదని, 2011కి ముందు ముద్రించిన పుస్తకాలు కావటంతో అప్పటి సీఎం కరుణానిధి పేరు ముద్రించి ఉండవచ్చని అధికారులు తెలిపారు. 2011లో ఏఐఏడీఎంకే అధినేత్రి జయలలిత సీఎంగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. కానీ, 2014 లో పరిమితికి మించి ఆస్తులు కూడగట్టిన కేసులో పదవి కోల్పోయారు. ఆ తరువాత పన్నీర్ సెల్వం తమిళనాడు సీఎంగా కొనసాగారు. ఈ ఏడాది మే 23న జయలలితను కర్ణాటక హైకోర్టు నిర్ధోషిగా తేల్చడంతో ఆమె తిరిగి సీఎం పదవిని పొందారు.