చెన్నై: కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా అనేక మంది ప్రాణాలను బలిగొంది. ఈ వైరస్‌కి వ్యాక్సిన్ కనిపెట్టడానికి ప్రపంచ దేశాలన్ని అలుపెరుగని పరిశోధనలు చేస్తున్నాయి. ఈ వ్యాక్సిన్ కనిపెట్టడానికి సంవత్సరంపైగా పట్టొచ్చని ప్రపంచ ఆరోగ్యసంస్థే పేర్కొంది. అయితే తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి మాత్రం తాను కరోనాకి ఆయుర్వేదిక్ మందు కనిపెట్టేశానని సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నాడు. 48 గంటల్లో కరోనా వ్యాధి సోకిన వ్యక్తిని మాములు మనిషిని చేస్తానంటూ సోషల్ మీడియా వేదికగా సవాల్ విసురుతున్నాడు. సమాచారం అందుకున్న ఇండియన్ మెడిసన్ అండ్ హోమియోపతి దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనికశాలమ్ అనే వ్యక్తి సోషల్ మీడియా ద్వారా కరోనా నియంత్రణకు మందు కనిపెట్టానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. (ఒక్కరోజులో రూ.172 కోట్ల ఆదాయం)
తనికశాలమ్ కోయాంబేడు బస్టాండ్ సమీపంలో ఎలాంటి అనుమతులు, అర్హత లేకుండా ఆయుర్వేద ఆసుపత్రిని నడుపుతున్నాడు. దీనికి తోడు కరోనా వ్యాధికి సంబంధించి 70 కిపైగా వీడియోలను పలు సోషల్ మీడియా ఛానెల్స్‌లో పోస్ట్ చేశాడు. లండన్‌కు చెందిన ఓ వ్యక్తికి తాను చికిత్స చేసి కరోనా నుంచి రక్షించానని ప్రచారం చేసుకున్నాడు. అగతియార్, పోగర్‌లాంటి సిద్దులు కూడా ఎలాంటి చదువు లేకుండానే అనేక వైద్య విధానాలు కనుగొన్నారని, చదువుకు మందు కనిపెట్టడానికి సంబంధం లేదని ప్రచారం చేపట్టాడు. ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్న అతనిపై డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ సెక్షన్ 54 కింద పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఇలాంటి తప్పుడు పద్దతుల ద్వారా ప్రజలను ప్రభావితం చేయడం, తప్పుడు వార్తలు సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చేయడం అనేది ఎపిడమిక్ డిసీస్ యాక్ట్ అండ్ రెగ్యూలేషన్ చట్టం ప్రకారం నేరమని పోలీసులు తెలిపారు. ( ఆయుర్వేద మూలిక అశ్వగంధపై క్రినికల్ ట్రయల్స్)
Comments
Please login to add a commentAdd a comment