రోకలితో కొట్టి.. భర్తను హతమార్చింది | Tamil Nadu woman kills husband who had extramarital affairs | Sakshi
Sakshi News home page

రోకలితో కొట్టి.. భర్తను హతమార్చింది

Published Fri, Jun 12 2015 2:58 PM | Last Updated on Mon, Jul 29 2019 5:43 PM

రోకలితో కొట్టి.. భర్తను హతమార్చింది - Sakshi

రోకలితో కొట్టి.. భర్తను హతమార్చింది

తమిళనాడులోని మధురైలో గురువారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. మధురై జిల్లా వాడిపట్టి గ్రామంలో భార్యభర్తల మధ్య కొన్నాళ్లుగా సాగుతున్న విభేదాలు, వివాదాలు భర్త హత్యకు దారి తీశాయి.

మధురై: తమిళనాడులోని మధురైలో గురువారం రాత్రి దారుణం  చోటుచేసుకుంది. మధురై జిల్లా వాడిపట్టి గ్రామంలో భార్యభర్తల మధ్య కొన్నాళ్లుగా సాగుతున్న విభేదాలు, వివాదాలు భర్త హత్యకు దారి తీశాయి. సెల్వి(35), చెల్లాపాండి (38) ఇద్దరూ భార్యభర్తలు. వీరికి 15, 14 ఏళ్ల వయసున్న కుమార్తె, కుమారుడు ఉన్నాడు.  చెల్లాపాండికి వివాహేతర సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో పాటూ, చేతబడి చేస్తాడనే అనుమానాలు ఉన్నాయి.  ఈ  నేపథ్యంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి.

 

ఈ నేపథ్యంలో గురువారం రాత్రి కూడా ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. తరువాత చెల్లాపాండి నిద్రపోయాడు. ఇదే అదనుగా భావించిన  సెల్వి రోకలిబండతో భర్త తలపై బలంగా కొట్టడంతో అతను ప్రాణాలు వదిలాడు. అనంతరం సెల్వి పోలీసులకు లొంగిపోయింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement