
ఆరోగ్యబీమాకు పన్ను రాయితీ పెంపు
ఆదాయపన్ను శ్లాబులలో ఎలాంటి మార్పు చేర్పులు చేయని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, వేరే రకంగా మాత్రం కొంత ప్రయోజనం కల్పించారు. ఆరోగ్య బీమా కోసం చెల్లించే ప్రీమియం మీద పన్ను మినహాయింపు కోసం పరిమితి పెంచారు. ప్రస్తుతం ఇది రూ. 15 వేలుగా ఉండగా, దాన్ని రూ. 25 వేలకు పెంచారు. అంటే, రూ. 25 వేల వరకు చేసే ప్రీమియం చెల్లింపులకు పన్ను రాయితీ వర్తిస్తుంది. సీనియర్ సిటిజన్ల విషయంలో దీన్ని రూ. 10 వేల నుంచి రూ. 30 వేలకు పెంచారు. ఆరోగ్య బీమా వర్తించని 80 ఏళ్ల వయసు దాటిన వారికి రూ. 30వేల వరకు వైద్య బిల్లులను పన్ను నుంచి మినహాయిస్తారు. వికలాంగులకు అదనంగా రూ. 20 వేల పన్ను రాయితీ కల్పించారు. పెన్షన్ ఫండ్కు చెల్లించే మొత్తంపై పన్ను రాయితీ పరిమితిని రూ. 1 లక్ష నుంచి రూ. 1.5 లక్షలకు పెంచారు.