Union budget 2015
-
తెలంగాణకు కేంద్రం మొండిచేయి
సాక్షి, ఖమ్మం: రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం తెలంగాణకు ఇచ్చిన హామీలను విస్మరించిందని, 2015-16 బడ్జెట్ ఇందుకు నిదర్శనమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. సోమవారం ఖమ్మం లో పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. విభజన సమయం లో రాష్ట్రానికి ఉక్కు కర్మాగారం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, మైనింగ్, ఉద్యానవన వర్శిటీలు, ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా ఇస్తామని ప్రకటించి బడ్జెట్లో మాత్రం ఈ అంశాల ఊసే ఎత్తలేదన్నారు. భద్రాచలం-కొవ్వూ రు రైల్వే లైన్‌కు మొక్కుబడిగా నిధులు కేటాయించి చేతులు దులుపుకుందని ఆరోపిం చారు. భూ సేకరణ బిల్లుకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేసి రైతుల ఆందోళనకు అండగా నిలిచిందన్నారు. కేం ద్రం నుంచి నిధుల సాధనలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ఇందుకు బీఆర్జీఎఫ్ నిదర్శనమని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. మొదటి వి డత ఇచ్చిన బీఆర్జీఎఫ్ ఖర్చు చేయలేదన్న సాకుతో కేంద్రం ఈసారి రాష్ట్రానికి మొండి చేయి చూపినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. మంత్రులు, పార్లమెంటరీ కార్యదర్శులు బుగ్గకార్లు పెట్టుకోగానే సరిపోదని నిధుల సాధనకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఈ సందర్భంగా సూచించారు. మేనిఫెస్టో మరచిన టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను టీఆర్ఎస్ అమలు పరచకుండా విస్మరించిందని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. బడ్జెట్ రూ.లక్షల కోట్లు దాటాలనే తపనే తప్పా రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారు. తొలి స్వల్పకాలిక బడ్జెటే వాస్తవంగా లేదని ప్రతిపక్షాలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అసెంబ్లీలో గళమెత్తిందన్నారు. ఎన్నికలకు ముందు సీఎం ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికారప్రతినిధి ఆకుల మూర్తి, సంయుక్త కార్యదర్శి షర్మిల సంపత్, జిల్లా అధికార ప్రతినిధి ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఇల్లెందు, పాలేరు నియోజకవర్గ ఇన్చార్జులు గుగులోతు రవిబాబునాయక్, సాధు రమేషరెడ్డిలు పాల్గొన్నారు. -
కేంద్రంపై తొడగొట్టిన బాలయ్య
-
కేంద్రంపై తొడగొట్టిన బాలయ్య
హిందూపూర్ ఎమ్మెల్యే, సినీహీరో నందమూరి బాలకృష్ణ కేంద్రప్రభుత్వంపై మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టుకు కేవలం వంద కోట్ల రూపాయలు మాత్రమే కేటాయిస్తే ఏ మూలకు సరిపోతాయని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడంపై ఇతర రాష్ట్రాలకు లేని ఇబ్బంది కేంద్రానికి ఎందుకని నిలదీశారు. హంద్రీ నీవా కాలువ పనుల పర్యవేక్షణ కోసం అనంతపురం జిల్లాకు వెళ్లిన ఆయన.. ఈ సందర్భంగా అనంతపురంలో మీడియాతో మాట్లాడారు. సాధారణ, రైల్వే బడ్జెట్లు రెండింటిలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని చెప్పారు. టీడీపీ- బీజేపీ కూటమిని గెలిపించిన ప్రజలను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తోందని బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆందోళనను ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని కోరారు. నిర్లక్ష్య విధానాన్ని కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. -
పోలవరానికి 100కోట్లివ్వడం అన్యాయం: ఉండవల్లి
-
అంతన్నారింతన్నారు..!
అంతన్నారు... ఇంతన్నారు... అరచేతిలో స్వర్గం చూపించారు... పల్లెలను భూతల స్వర్గాలుగా మార్చేస్తామని చెప్పారు... సరిగ్గా సమయం వచ్చే సరికి చెవుల్లో ‘కమలం’ పెట్టారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలుగు వారిపై కరుణ చూపలేదని నాయకులు మండి పడ్డారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు, చెప్పిన మాటలను పక్కన పెట్టి బడ్జెట్‌ను రూపొందించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస పాటి కేటాయింపులు కూడా చేయకుండా తెలుగు వారికి తీరని అన్యాయం చేశారని అన్నారు. కార్పొరేట్ సంస్థలకు అనుకూలం... కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉన్న బడ్జెట్ ఇది.ఆ సంస్థలకు 30 శాతంగా ఉన్న పన్నును 25 శాతానికి తగ్గించి మేలు కలిగించారు. పేద, మధ్యతరగతి ప్రజలు వినియోగించే వస్తువులపై 12 శాతంగా ఉన్న పన్నును 15శాతానికి పెంచి పేదల నడ్డి విరిచారు. రైతులకు సంబంధించి సబ్సిడీని ఎత్తివేసి నగదు బదిలీ పథకాన్ని తెచ్చారు. మన రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న ప్రత్యేక హోదా, ప్యాకేజీ విషయాన్ని పూర్తిగా విస్మరించారు. గత ఎన్నికల్లో మోదీని కార్పొరేట్ శక్తులు డబ్బులు ఖర్చుచేసి గెలిపించిన రుణాన్ని తీర్చుకునేందుకు కార్పోరేట్ సంస్థలకు అనుకూలంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు - పి.కామేశ్వరరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి సామాన్యులకు ప్రయోజనం లేని బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం విభజన చట్టాన్ని తుంగలో తొక్కింది. విడిపోయిన ఆంధ్రాకు తగినన్ని నిధులు రాలేదు. పెరిగిన పెట్రో, డీజిల్ ధరలతో సామాన్యులపై భారం పడుతుంది. రాష్ట్రానికి నిరాశే మిగిలింది. ప్రత్యేక హోదా రాలే దు. ప్రత్యేక నిధులూ రాలేదు. విభజన చట్టంలో నాడు పొందుపరిచిన అంశాల సాధనకు, రాష్ట్రాభివృద్ధికి తగిన నిధులు రాబట్టేందుకు ప్రధాని మోదీని తెలుగుదేశం నేతలు కలుస్తాం. కేంద్రంపై ఒత్తిడి పెంచుతాం. చాలా నిరాశజనకంగా ఉన్న బడ్జెట్ ఇది. - కోళ్ల లలితకుమారి, ఎస్.కోట ఎమ్మెల్యే ఒరిగేదేమీ లేదు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా మన రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదు. రాష్ట్ర విభజన కారణంగా హైదరాబాద్ నగరంతో వచ్చే ఆదాయాన్ని కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ కోసం బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావన చేయలేదు. ఇది నిరాశ కలిగించింది. వ్యవసాయ రంగానికి సుమారు లక్ష కోట్ల రూపాయలు కేటాయించడం ద్వారా జైట్లీ బడ్జెట్ రైతులకు పెద్ద పీట వేసింది. ముద్ర బ్యాంకును 20వేల కోట్ల రూపాయలతో స్థాపించి చిరు వ్యాపారులు, కుటీర పరిశ్రమల నిర్వాహకులకు తిరిగి రుణాలు ఇచ్చే యోచన హర్షణీయం. బడ్జెట్లో పన్ను మార్పులు అంతగా ఆకర్షణీయంగా లేవు. - ఈఆర్ సోమయాజులు, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ దీర్ఘంగా ఆలోచించాలి వృత్తిపై నైపుణ్యంపై కేంద్రమంత్రి శ్రద్ధ కనబరచలేదు. జాతీయ స్థూల ఆదాయ ఉత్పత్తుల్లో సమతౌల్యం పాటించడంలో ఇంకా ఆలోచన చేయాల్సి ఉంది. మంచి బడ్జెట్ ప్రవేశపెట్టాలన్న ఆత్రుతతో కీలక అంశాలను కేంద్ర ప్రభుత్వం విస్మరించింది. విద్య, ఉపాధి, ఆరోగ్యంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన మౌలిక ఆదేశాలు ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులపై పూర్తిస్థాయి పర్యవేక్షణ ఉండాలి. ఈ బడ్జెట్‌తో రాష్ట్రానికి ఒనగూరిన ప్రయోజనం శూన్యమేనని చెప్పాలి. ఇది మన నాయకుల వైఫల్యమే. - భీశెట్టి బాబ్జీ, రాష్ట్ర కార్యదర్శి, లోక్‌సత్తా పార్టీ ధరల తగ్గింపేదీ..? ఇప్పటికే నిత్యావసర సరుకులు, పెట్రో, డీజిల్ ధరలు బాగా పెరిగి ఉన్నాయి. ఈ బడ్జెట్‌తో వాటి ధరలు ఇంకా పెరుగుతాయి. ఇప్పటికే ధరల దడతో ఉన్న ప్రజలకు ఇది చేదు వార్తే. సామాన్యుల కోసం ధరలు తగ్గించే ప్రయత్నాన్ని చేయలేదు. రాష్ట్ర విభజన అనంతరం పూర్తి లోటుతో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన కేంద్రం బడ్జెట్లో రాష్ట్రంపై ఏ మాత్రం కనికరం చూపలేదు. కనీస కేటాయింపులు కూడా చేయకపోవడం దారుణం. బీజేపీ మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ రాష్ర్టంలో అధికారంలో ఉన్నా సరిపడినన్ని నిధులు రాష్ట్రానికి రాకపోవడం దురదృష్టకరం. - పీవీకే మణికుమార్, వ్యాపారవేత్త, పార్వతీపురం మాటల గారడీ.. కేంద్ర ప్రభుత్వం నిరాశాజనకమైన బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. మాటల గారడీయే తప్ప ఎలాంటి స్పష్టతా లేదు. ముఖ్యం గా ఎన్నాళ్ల నుంచో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేస్తామని చెబుతున్నారు. కానీ ఎప్పు డూ దీనిపై నిరాశే మిగులుతోంది. ఆదాయపు పన్ను అంశం ఒక్కటే కాస్త సంతృప్తి కలిగించే అంశం. మిగతా విషయాల్లో అంతా మాటల గారడీతోనే సరిపెట్టేశారు. రా్రష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక సాయాన్ని కూడా ప్రకటించకపోవడం దారుణం. - ఆర్వీఎస్కేకే రంగారావు, వైఎస్సార్ సీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి వ్యవసాయ రంగానికేదీ ప్రాధాన్యత? కేంద్ర ప్రభుత్వం ప్ర వేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయ రం గాన్ని పూర్తిగా విస్మరిం చారు. ఇలాంటి బడ్జెట్‌తో ఇప్పటికే కష్టాల సాగు చేస్తున్న కర్షకులు నిరాసక్తతకు లోనవుతారు. రాజధాని నిర్మాణానికి కూడా నిధులు ఇవ్వకపోవడం దారుణం. రాష్ర్ట ప్రభుత్వం కూడా ఈ విషయమై మిన్నకుండిపోవడం మరింత దారుణం. - పెనుమత్స సాంబశివరాజు, కేంద్ర పాలకమండలి సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ విఫలమైంది కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టడంలో టీడీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కేంద్రప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి కూడా నిధులు కేటాయించేలా చేయలేకపోయారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన బీజేపీ మాట నిలబెట్టుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం 16వేల కోట్ల లోటులో ఉన్నా అవసరమైన నిధులు మంజూరు చేయలేదు. లక్షకోట్లతో రాజధాని నిర్మాణమన్నారు. దానికి పైసా కేటాయించలేదు. రైల్వే బడ్జెట్లో కూడా రాష్ట్రానికి తీరని అన్యాయమే జరిగింది. - పీడిక రాజన్నదొర, ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు నడ్డి విరిచే బడ్జెట్... కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యుడు నడ్డి విరిచే విధంగా ఉంది. పెట్టుబడిదారులకు కొమ్ము కాసే బడ్జెట్‌ను తలపిస్తోంది. సామాన్యుడు వినియోగించే వస్తువులపై ట్యాక్సులు అధికంగా పెంచారు. దేశవ్యాప్తంగా ఆయిల్ ధరలు తగ్గుతుంటే ఏపీలో మాత్రం పెట్రోల్, డీ జిల్ ధరలు విపరీతంగా పెంచేశారు. ప్రభుత్వానికి సంక్షే మం, అభివృద్ధి రెండు కళ్లులా ఉండాలి. అలాంటిది సంక్షేమాన్ని విస్మరిస్తున్నా రు. ఎన్నికలు ముందు తెలుగుదేశం, బీజేపీలు రెండూ కలిసి ఏపీకు ప్రత్యేక హో దా, ప్రత్యేక ప్యాకేజీ కల్పిస్తామని చెప్పారు. ఈ బడ్జెట్లో కనీసం ప్రత్యేక ప్యాకేజీ కూడా ఇవ్వలేదు. తెలుగుదేశం ఎంపీలూ ఏమీ మాట్లాడడం లేదు. కనీసం ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే పరిశ్రమలు అభివృద్ధి చెంది, ఉద్యోగ అవకాశాలు వచ్చేవి. ప్రత్యేక ప్యాకేజీ సాధించుకోవడంలో తెలుగుదేశం ఎంపీలు విఫలమయ్యారు. - బెల్లాన చంద్రశేఖర్, వైఎస్సార్ సీపీ విజయనగరం పార్లమెంటు పరిశీలకుడు -
అమలు చేసుకునేదే.. కాదు చేయలేనిది..
కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ శనివారం లోక్‌సభలో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ను చారిత్రాత్మకం అంటూ స్వపక్షంవారు ఆకాశానికెత్తగా.. విపక్షం వారు విమర్షలు గుప్పించారు. ఇది చారిత్రాత్మక బడ్జెట్ అని, పేదల బడ్జెట్ అని, పేదల కొరకు తయారు చేసిన బడ్జెట్ అని బీజేపీ అనగా.. అసలు పేదలనే పూర్తిగా విస్మరించారంటూ కాంగ్రెస్ నేతలు విమర్శించారు. పూర్తిగా అమలు చేసుకోదగిన బడ్జెట్ అని ప్రధాని నరేంద్రమోదీ అనగా.. అసలు ఆచరణ సాధ్యం కాదని విపక్షం వారన్నారు.. ఇలా బడ్జెట్‌పై వివిధ పార్టీలవారు వెలిబుచ్చిన ప్రతిస్పందనలు వారి మాటల్లోనే.... బడ్జెట్‌పై అధికారపక్ష ప్రతిస్పందనలు.. ప్రధాని నరేంద్రమోదీ(భారత ప్రధాని) 'ఇది స్పష్టమైన దృష్టిని కలిగిన బడ్జెట్. ఇందులో రైతులు, యువకులు, పేదలు, మధ్యతరగతి, అందరిని దృష్టిలో పెట్టుకున్నారు. సమన్యాయం, వృద్ధి, ఉద్యోగితవంటి అంశాలను పొందుపరిచారు. ప్రగతి పూర్వక, సానుకూలత, ఆచరణకు అనుకూలమైన బడ్జెట్ ఇది. రాజ్‌నాథ్ సింగ్ (కేంద్ర హోంమంత్రి) ఆధునిక భారతాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు చాలా ఉపయోగపడే బడ్జెట్ ఇది. దేశంలోని పేదరికాన్ని, నిరుద్యోగితను రూపుమాపడానికి ఉపయోగపడుతుంది. మనోహర్ పారికర్ (రక్షణశాఖ మంత్రి) జైట్లీ ఆయన విద్యుక్త ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించారు. ఆయనకు ఈ విషయంలో నేను 10 కి 9.5 మార్కులు వేస్తాను. ప్రకాశ్ జవదేకర్ (పర్యావరణశాఖ మంత్రి) ఇది చారిత్రాత్మక బడ్జెట్. అన్ని వర్గాల ప్రజలకు సామాజిక భద్రతను కల్పిస్తుంది. ఇది పేద ప్రజల బడ్జెట్. పేదల కోసం తయారుచేసిన బడ్జెట్. నితిన్ గడ్కరీ (కేంద్ర మంత్రి) మొత్తం చరిత్రలోనే మౌలిక సదుపాయాలకు పెద్ద పీఠవేసిన మొట్ట మొదటి బడ్జెట్ ఇదే. దీని ద్వారా దేశంలో ఉద్యోగిత, అవకాశాలు పెరుగుతాయి. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయం మరింత మెరుగవనుంది. వెంకయ్యనాయుడు (కేంద్రమంత్రి) ఈ బడ్జెట్‌తో ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు. ఇది ఆమ్ జాంతా బడ్జెట్. ఎంతో ప్రోత్సాహకంగా, కొత్త ఆవిష్కరణలు జరిగేలాగా ఇది ఉంది. రాజ్యవర్ధన్ రాథోడ్ (బీజేపీ) దేశంలోని యువకుల నుంచి పెద్దవారి వరకు అందరిని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన బడ్జెట్ ఇది. దేశ ప్రయోజనాలన్నింటిని దృష్టిలో పెట్టుకుంది. బడ్జెట్‌పై విపక్షాల ప్రతి స్పందనలు.. మన్మోహన్సింగ్ (మాజీ ప్రధాని, కాంగ్రెస్) ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశ పెట్టిన బడ్జెట్ విషయంలో నాకు ఎలాంటి ఆందోళన లేదు. అందులో ఉద్దేశాలు బాగున్నాయి. కాకపోతే వాటి అమలుకు మాత్రం ప్రభుత్వం వద్ద సరైన రోడ్ మ్యాప్ ఉన్నట్లు నాకు అనిపించడం లేదు. పీసీ చాకో (కాంగ్రెస్) ఈ బడ్జెట్ నన్ను తీవ్రంగా నిరాశపరిచింది. వాళ్లు ఇంకా పలు వారు చాలా పనులు చేయాల్సి ఉంది. మల్లికార్జున ఖార్గే (కాంగ్రెస్) సాధరణ పౌరులను ఈ బడ్జెట్ దృష్టిలో పెట్టుకోలేదు. ఇదొక విజన్ డాక్యుమెంట్ మాత్రమే. ముమ్మాటికీ కార్పొరేటర్లు, పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉన్న బడ్జెట్ మాత్రమే తప్ప మరొకటి కాదు. కమల్‌నాథ్ (కాంగ్రెస్) ఇది కమిషన్ల, కమిటీల, హామీల బడ్జెట్ మాత్రమే తప్ప మరొకటి కాదు. మనీశ్ తివారీ (కాంగ్రెస్) ఉద్దేశాలు గొప్పగా ఉన్నా.. కేటాయింపులు మాత్రం తక్కువగా ఉన్నాయి. అశ్వనీ కుమార్ (కాంగ్రెస్) ఇది అంకెల గారడి బడ్జెట్ మాత్రమే. శశి థరూర్ (కాంగ్రెస్) ఆర్థికమంత్రిగారు పేదలను పూర్తిగా విస్మరించారు. ఇది కార్పొరేట్ ఫ్రెండ్లీ బడ్జెట్. కేరళకు మాత్రం ఇది మంచి వార్తే. అక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పీచ్ అండ్ హియిరింగ్ను ప్రత్యేక అవసరాలుగల వారికి ప్రత్యేక విశ్వవిద్యాలయంగా మార్చడం మంచిదే. మాయావతి (బీఎస్పీ) ఇది పేదలకు వ్యతిరేకమైన బడ్జెట్ ఇది. ఈ బడ్జెట్ ఆచరణలో సాధ్యం కాదు. దేశంలోని పేదలు, సామాన్యుల ఆశలకు తగినట్లుగా లేదు. సుప్రియా సులే(ఎన్సీపీ) ఇది ముమ్మాటికి విమర్షించాల్సిన బడ్జెటే. ప్రజలకు వారు ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది. జై పాండా (బీజేడీ) ఇదొక బిగ్ బ్యాంగ్ బడ్జెట్. ఒడిశాకు వారు కొత్తగా కేటాయించిందేమీ లేదు. మా పక్క రాష్ట్రాలు ఎన్నో కేటాయింపులు పొందాయి. అలాంటి కేటాయింపులు పొందాల్సిన అవసరాలు మాకు చాలా ఉన్నాయి. -
కుతుబ్ షాహీ టూంబ్స్ అభివృద్ధికి నిధులు
న్యూఢిల్లీ: భారతదేశంలోని చారిత్రక నగరాలను అభివృద్ధి చేస్తామని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ముఖ్యంగా గోవాలోని చర్చిలు, రాజస్థాన్ లోని అడవుల అభి వృద్ధి , గుజరాత్ లోని రాణి కా వావ్ ప్యాలస్ అభివృద్ధి, లడఖ్ లోని లే హ్ ప్యాలెస్, పంజాబ్ లోని జలియన్ వాలాబాగ్, కర్నాటక లోని హంపి, ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి, హైదరాబాద్ లోని కుతుబ్ షాహీ టూంబ్స్ అభివృధ్దికి నిధులు కేటాయిస్తామన్నారు. వీసా సౌకర్యాలను మెరుగు పర్చిన తరువాత భారతదేశం పర్యాటకపరంగా అభివృద్ధి చెందిందన్నారు. వివిధ దశల్లో వీసా ఆన్ అరైవల్ సౌకర్యాన్ని 150 దేశాలకు పెంచుతున్నామని ఆయన ప్రకటించారు. -
జైట్లీ సాదా సీదా బడ్జెట్
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2015-16 ఆర్థిక సంవత్సరానికి సాదా సీదా సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రపంచంలోని బలమైన ఆర్థిక వ్యవస్థలే అతలాకుతలమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత ఆర్థిక వ్యవస్థ ఆశాజనకంగా ఉందంటూ బడ్జెట్ ఉపన్యాసాన్ని ప్రారంభించిన అరుణ్ జైట్లీ, ముందుగా ఆశలు రేకెత్తించి అంతలోనే వాటిని నీరుగార్చారు. ఉద్యోగుల ఆదాయం పన్ను మినహాయింపు రాయితీల్లో ఎలాంటి మార్పులు చేయకుండా వారి ఆశలను అడియాసలు చేశారు. ఆరోగ్య బీమా ప్రీమియం ఆదాయం పన్ను మినహాయింపు పరిమితిని రూ. 15 వేల నుంచి రూ. 25 వేలకు, ప్రయాణ భత్యాన్ని 800 నుంచి 1600కు పెంచుతూ గుడ్డిలో మెల్లగా ఏదో చేశామనిపించారు. అలాగే వయోవృద్ధుల వైద్య ఖర్చులపై పన్ను మినహాయింపు పరిమితిని 20వేల నుంచి 30 వేలకు పెంచారు. ఆరోగ్య బీమాలేని 80 ఏళ్లు దాటిన వారికి కూడా 30వేల మేరకు వైద్య ఖర్చులను అనుమతిస్తామని తెలిపారు. పీపీఎఫ్, ఈపిఎఫ్ ఖాతాల్లో ఎవరు క్లెయిమ్ చేయని కారణంగా పేరుకుపోయిన రూ. 9,000 కోట్ల నుంచి వృద్ధుల సంక్షేమం కోసం నిధిని ఏర్పాటు చేస్తున్నామంటూ వారికి సాంత్వన కలిగించారు. ప్రధాన మంత్రి బీమా యోజన కింద కేవలం 12 రూపాయల వార్షిక ప్రీమియంతో రూ. 2 లక్షల ప్రమాద బీమాను ప్రకటించడం పేదలకు మేలు చేసే చర్య. ఇక రైతులకిచ్చే పంట రుణాల లక్ష్యాన్ని రూ. 50 వేల కోట్ల నుంచి ఏకంగా 8.5 లక్షల కోట్లకు పెంచుతూ వారిని కరుణించారు. ఈ లక్ష్యాన్ని బ్యాంకులు పరిపూర్తి చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ప్రధాన మంత్రి వ్యవసాయ యోజనకు రూ. 3వేల కోట్లు కేటాయించడం ముదావహం. ప్రధానమంత్రి మోదీ మానసపుత్రిక ‘స్వచ్ఛ బారత్’కు పెద్ద పీట వేశారు. స్వచ్చ భారత్ నిధికి ఇచ్చే విరాళాలకు నూటికి నూరు శాతం పన్ను మినహాయింపు ప్రకటించారు. స్వచ్ఛ భారత్ ప్రచారం కోసం అన్ని పన్నులపై 2% లెవీ విధించారు. రానున్న బీహార్, పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆ రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ తరహాలో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీలు ఇస్తామని ప్రకటించారు. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చట్టబద్ధంగా ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌తోపాటు జమ్మూ కాశ్మీర్లో ఐఐఎంలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. నాలుగేళ్లపాటు కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి పాతిక శాతానికి తగ్గిస్తూ ఆ రంగాన్ని మెప్పించేందుకు ప్రయత్నించారు. కోటీ రూపాయలకు పైగా ఆదాయం కలిగిన సుసంపన్నులపై సంపన్న పన్నును ఎత్తివేసి 2 శాతం సర్‌చార్జీని విధించారు. సర్‌చార్జి ద్వారా రూ. 9వేల ఆదాయం వస్తుందని ప్రకటించి దీనివల్ల వారికి కూడా ప్రయోజనం లేదని ఆయన చెప్పకనే చెప్పారు. కొన్ని ముడి సరకులపై కస్టమ్స్ సుంకాన్ని పెంచుతూ వారిపైనా కూడా భారం వేశారు. దేశ, విదేశాల్లో మూలుగుతున్న నల్ల డబ్బును తెచ్చేందుకు చర్యలను ముమ్మరం చేస్తున్నామని అన్నారు. అందులో భాగంగా నల్ల కుభేరులకు పదేళ్ల జైలు శిక్ష విధించే కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నామని ప్రకటించారు. ప్రత్యక్ష పన్నుల డ్రాప్ కోడ్‌ను ఎత్తివేశారు. పారిశ్రామిక రంగంలో ఎస్సీ, ఎస్టీలకు చెందిన ఔత్సాహిక వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు 20వేల కోట్ల రూపాయల మూల ధనంతో ముద్రా బ్యాంకును ఏర్పాటు చేస్తున్నట్లు అరుణ్ జైట్లీ ప్రకటించారు. పారిశ్రామిక రంగంలోకి అడుగుపెట్టాలనుకుంటున్న ఎస్సీ, ఎస్టీలకు ఈ ముద్రా బ్యాంకు మూల ధనం నుంచి రుణాలందిస్తారు. స్థిరాస్తుల కొనుగోలుకు రూ. 20 వేల నుంచి నగదు చెల్లించరాదని, లక్ష రూపాయలకు మించి స్థిరాస్తులు కొనుగోలు చేసిన సందర్భాల్లో పాన్ నెంబర్ తప్పనిసరిగా పేర్కొనాలంటూ మధ్యతరగతి ప్రజలకు కొత్త ఇబ్బందులు తీసుకొచ్చారు. ఎల్పీజీ నగదు బదిలీ స్కీమ్‌ను కొనసాగిస్తామంటూ ఉన్నత ఆదాయం పన్ను చెల్లిస్తున్న సంపన్నవర్గాల వారికి ఎల్పీజీపై సబ్బిడీని ఎత్తివేస్తామని సూచించారు. ముందు స్వచ్చందంగా మంత్రులు, పార్లమెంట్ సభ్యులు ఈ సబ్సిడీలను వదులుకుంటున్నారని హర్షధ్వానాల మధ్య జైట్లీ ప్రకటించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఎత్తేయాలని ఓ సమయంలో సర్కారు అనుకున్నా.. ఈసారి ఆ పథకం అమలుకు ఏకంగా రూ. 34,699 కోట్ల కేటాయింపులను అరుణ్ జైట్లీ ప్రకటించారు. గ్రామీణ మౌలిక సౌకర్యాల నిధికి రూ. 25వేల కోట్లు కేటాయించారు. పేద ప్రజల అభ్యున్నతికి ఏకరీతి సామాజిక భద్రత స్కీమ్‌ను ప్రకటించారు. దేశంలో విద్యుత్ కొరతను నివారించేందుకు 4,000 మెగావాట్లను ఉత్పత్తిచేసే సామర్థ్యంగల ఐదు అత్యాధునిక మెగా విద్యుత్ ప్రాజెక్టులను తీసుకొస్తున్నట్లు ప్రకటించిన జైట్లీ, అందుకు భారీ మొత్తంలో లక్ష కోట్ల రూపాయలను కేటాయించారు. ఏడాదిలోగా కూడంకుళంలోని రెండో అణు విద్యుత్ ఉత్పాదన యూనిట్ ఉత్పత్తి ప్రారంభమవుతుందని చెప్పారు. ఇంకా దేశంలో 80 వేల మాధ్యమిక పాఠశాలలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఎస్సీల సంక్షేమం కోసం రూ. 30,851 కోట్లు, మహిళల సంక్షేమానికి రూ. 79,258 కోట్లు కేటాయించారు. సమ్మిళిత శిశు అభివృద్ధి పథకానికి 1500 కోట్లు, సమ్మిళిత శిశు పరిరక్షణ స్కీమ్‌కు మరో 500 కోట్ల రూపాయలను కేటాయించారు. నిర్భయ నిధిని వెయ్యి కోట్ల నుంచి రెండువేల కోట్ల రూపాయలకు పెంచారు. పరిశోధనారంగంలో సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు అటల్ బిహారీ వాజపేయి పేరుతో కొత్తగా ఓ స్కీమ్‌ను ఏర్పాటుచేసి దానికి రూ. 150 కోట్లు కేటాయించారు. రక్షణ రంగానికి కేటాయింపులను 2,22,370 నుంచి 2,46, 727 కోట్ల రూపాయలకు పెంచారు. -
కేంద్ర బడ్జెట్ 2015-16 : సమగ్ర విశ్లేషణ
-
ప్రత్యేక హోదాపై కేంద్రం నిరాశపరిచింది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం నిరాశ పరిచిందని వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. అసలు ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం టీడీపీ, బీజేపీలేనని ఆయన మండిపడ్డారు. ఉపాధి హామీ పథకానికి నిధుల కేటాయింపు పెంచడం మాత్రం హర్షణీయమన్నారు. రైతుల కోణంలో నుంచి ఇది నిరాశాజనకమైన బడ్జెట్ అని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విమర్శించారు. పంటబీమా, గిట్టుబాటు ధరల అంశాలకు బడ్జెట్లో ప్రాధాన్యం దక్కలేదని ఆయన అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం అత్యంత నిరాశపరిచే అంశమని అవినాష్ రెడ్డి అన్నారు. ఇక పేదరిక నిర్మూలనకు కేంద్రం ప్రత్యేకంగా తీసుకున్న చర్యలేమీ లేవని మరో ఎంపీ వరప్రసాద్ అన్నారు. -
బడ్జెట్‌పై సోమయాజుల స్పందన..!
-
కేంద్ర బడ్జెట్ పూర్తి పాఠం ఇదీ..
ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ పూర్తి పాఠం కావాలంటే.. ఇక్కడ క్లిక్ చేయండి -
నిర్భయ ఫండ్‌కు రూ.2000 కోట్లు
న్యూఢిల్లీ : నిర్భయ ఫండ్ కోసం మూలధన నిధిని కేంద్ర ప్రభుత్వం రెట్టింపు చేసింది. గత ఏడాది నిర్భయ ఫండ్‌కు రూ.1,000 కోట్లు కేటాయించగా ఈసారి అదనంగా మరో వెయ్యి కోట్లు కేటాయించింది. ఈ నిధులను మహిళలు, బాలికల భద్రత కోసం వినియోగిస్తారు. నిర్భయ ఫండ్‌ను తొలిసారిగా యూపీఏ సర్కార్ 2013 సంవత్సరంలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. -
అచ్చే దిన్ అంటూనే వాతలు..
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ...అచ్చే దిన్ అంటూనే అందరికీ వాతలు పెట్టారు. 12.36 శాతంగా ఉన్న సర్వీస్ ట్యాక్స్‌ను 14 శాతానికి పెంచారు. ఈ అదనపు వాతతో ప్రభుత్వానికి ఏకంగా 15 వేల కోట్ల రూపాయలు సమకూరతాయి. పెరిగిన సర్వీస్ టాక్స్‌తో అన్ని సేవలు ఇక మరింత ప్రియం కానుంది. ఇక వేతన జీవులు ఎంతగానో ఎదురుచూసిన ఆదాయ పన్ను మినహాయింపు జోలికి ఆర్థిక మంత్రి పోలేదు. అయితే ఉద్యోగులకిచ్చే ట్రాన్స్‌పోర్టు అలవెన్స్‌ను ఎనిమిది వందల నుంచి 16 వందలకు పెంచడం కాసింత ఊరటగా చెప్పుకోవచ్చు. జన్‌ధన్ యోజన పథకం విజయవంతం కావడంతో... కొత్తగా ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి పేరుతో పేదలకు బీమా పథకాన్ని అమల్లోకి తేనున్నారు. ఏడాదికి 12 రూపాయల ప్రీమియం కడితే రెండు లక్షల రూపాయల కవరేజ్ ఈ పథకంలో ఇవ్వనున్నారు. అటల్ పెన్షన్ పేరుతో పేదలు, అణగారిన వర్గాలకు పెన్షన్ పథకాన్ని ప్రకటించారు. మరో వైపు కార్పొరేట్లకు పెద్ద పీట వేశారు. కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించారు. వచ్చే నాలుగేళ్ల వరకు ఇది అమల్లో ఉంటుందని భరోసా ఇచ్చారు. దేశీయంగా నల్లధనాన్ని అరికట్టేందుకు కొత్త చట్టాలు తీసుకురానున్నట్టు ప్రకటించారు. ఇక ఎప్పటిలాగానే సిగరెట్లపై ఎక్సైజ్ డ్యూటీని పెంచారు. అలాగే వెయ్యి రూపాయలలోపు పాదరక్షల ధరలు తగ్గనున్నాయి. -
కేంద్ర బడ్జెట్ 2015-16 : జైట్లీ ప్రసంగం Part3
-
కేంద్ర బడ్జెట్ 2015-16 : జైట్లీ ప్రసంగం Part1
-
కార్పొరేట్‌కు పెద్దపీట.. సామాన్యుడికి నిరాశ
కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ 2015-16 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో కార్పొరేట్ వర్గాలకు పెద్దపీట వేసి.. సామాన్యుడికి మాత్రం నిరాశనే మిగిల్చినట్లయింది. పన్ను రాయితీల కోసం ఎంతగానో ఎదురుచూసిన సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు పెద్దగా ఎలాంటి ప్రయోజనాలు కనిపించలేదు. ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపులపై పన్ను రాయితీ పరిమితి పెంచుతున్నట్లు ప్రకటించినా.. వాస్తవానికి ఏడాదికి రూ. 25 వేల ప్రీమియం చెల్లిస్తే.. 40 ఏళ్లు దాటిన వారికి సుమారు రూ. 15 లక్షల ఆరోగ్య బీమా వస్తుంది. అంత మొత్తాన్ని సామాన్య, మధ్యతరగతి ఉద్యోగులు సాధారణంగా చేయించుకునే అవకాశం ఉండదు. పైపెచ్చు సేవాపన్నును కూడా 12.36 శాతం నుంచి 14 శాతానికి పెంచడం వల్ల దాదాపు అన్ని ఖర్చులూ బాగా పెరుగుతాయి. కార్పొరేట్ పన్నును మాత్రం ఇప్పుడున్న 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించారు. ఇప్పుడున్న 30 శాతం పన్ను వల్ల ఆశించిన మొత్తంలో వసూళ్లు రావడం లేదని, అందుకే ఈసారి 25 శాతానికి తగ్గిస్తున్నామని చెప్పారు. ఇది నాలుగేళ్ల పాటు వర్తిస్తుందన్నారు. ఆ రకంగా కార్పొరేట్ వర్గాలకు పెద్దపీట వేస్తూ సామాన్యుడిపై చిన్నచూపు చూసినట్లుగా జైట్లీ బడ్జెట్ ఉందని చెబుతున్నారు. -
బడ్జెట్ లెక్కలివీ..
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ లోక్‌సభలో శనివారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను జైట్లీ రూ.17,77,477 కోట్ల బడ్టెట్‌ను రూపొందించారు. వైద్య, రక్షణ రంగాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. విద్యకు ప్రాధాన్యమిచ్చారు. బడ్జెట్ లోని ముఖ్యాంశాలు.. కేంద్ర బడ్జెట్ రూ.17,77,477 కోట్లు ప్రణాళికేతర వ్యయం రూ.13,12,200 కోట్లు ప్రణాళికా వ్యయం రూ.4,65,000 కేటాయింపులు విద్యా రంగానికి రూ.68,960 కోట్లు మహిళా శిషు సంక్షేమం రూ.10,500 కోట్లు వైద్యానికి రూ. 3,31,500 కోట్లు రక్షణకు రూ.2,46,727 కోట్లు జల వనరులకు రూ.4,173 కోట్లు గృహనిర్మాణాలకు రూ.22,407 కోట్లు సోలార్ ఎలక్ట్రికల్ వాహనాలకు రూ.70 కోట్లు ఎస్సీ సంక్షేమ పథకాలకు రూ.30 వేల కోట్లు నిర్భయ ఫండ్‌కు వెయ్యి కోట్లు మైక్రో ఫైనాన్స్ కు ముద్ర బ్యాంకు ద్వారా రూ.20 వేల కోట్లు. ఎంజీఎన్ రేగాకు రూ.5 వేల కోట్లు అల్ట్రా మెగా పవర్‌కు లక్ష కోట్లు. ఉపాధి హామీ పథకానికి అదనంగా రూ.5 వేల కోట్లు గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ.34 వేల కోట్లు వ్యవసాయ రుణాలు రూ.8.5 కోట్లు ఇవ్వాలనేది లక్ష్యం. మైక్రో ఫైనాన్స్ కు ముద్ర బ్యాంకు ద్వారా రూ.20 వేల కోట్ల ఫండ నాబార్డుకు 25 వేల కోట్లు స్వయం ఉపాధి కార్యక్రమాల కోసం వెయ్యి కోట్లు ఐటీ హబ్ ఏర్పాటుకు 150 కోట్లు శిషు సంరక్షణకు 300 కోట్లు చైల్డ్ డెవలప్మెంట్ కు 1500 కోట్లు మౌలిక వసతులకు 70 వేల కోట్లు స్టార్టప్ కంపెనీల కోసం వెయ్యి కోట్లతో మూల నిధి చిన్న తరహా నీటి పారుదల ప్రాజెక్టులకు రూ.5300 కోట్లు గ్రామీణాభివృద్ధికి రూ.25 వేల కోట్లు. -
లోక్‌సభ సోమవారానికి వాయిదా
-
పార్లమెంట్ సోమవారానికి వాయిదా
న్యూఢిల్లీ : పార్లమెంట్ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. బడ్జెట్ ప్రసంగం ముగియగానే బడ్జెట్ బిల్లులను సభలో ప్రవేశపెడుతున్నట్లు కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. అనంతరం బడ్జెట్‌ను ఆమోదిస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహజన్ ప్రకటించారు. ఆ తర్వాత సమావేశాలను స్పీకర్ సోమవారానికి వాయిదా వేశారు. -
కేంద్ర బడ్జెట్ 2015-16 : జైట్లీ ప్రసంగం Part2
-
ఆరోగ్యబీమాకు పన్ను రాయితీ పెంపు
ఆదాయపన్ను శ్లాబులలో ఎలాంటి మార్పు చేర్పులు చేయని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, వేరే రకంగా మాత్రం కొంత ప్రయోజనం కల్పించారు. ఆరోగ్య బీమా కోసం చెల్లించే ప్రీమియం మీద పన్ను మినహాయింపు కోసం పరిమితి పెంచారు. ప్రస్తుతం ఇది రూ. 15 వేలుగా ఉండగా, దాన్ని రూ. 25 వేలకు పెంచారు. అంటే, రూ. 25 వేల వరకు చేసే ప్రీమియం చెల్లింపులకు పన్ను రాయితీ వర్తిస్తుంది. సీనియర్ సిటిజన్ల విషయంలో దీన్ని రూ. 10 వేల నుంచి రూ. 30 వేలకు పెంచారు. ఆరోగ్య బీమా వర్తించని 80 ఏళ్ల వయసు దాటిన వారికి రూ. 30వేల వరకు వైద్య బిల్లులను పన్ను నుంచి మినహాయిస్తారు. వికలాంగులకు అదనంగా రూ. 20 వేల పన్ను రాయితీ కల్పించారు. పెన్షన్ ఫండ్‌కు చెల్లించే మొత్తంపై పన్ను రాయితీ పరిమితిని రూ. 1 లక్ష నుంచి రూ. 1.5 లక్షలకు పెంచారు. -
'లక్ష' దాటితే పాన్‌కార్డ్ తప్పనిసరి
న్యూఢిల్లీ : ఇక నుంచి లక్ష దాటిన ఆర్థిక వ్యవహారాలకు పాన్‌కార్డు తప్పనిసరి కానుంది. నల్లధనాన్ని నియంత్రించటానికి కేంద్రం నడుము బిగించింది. దాంతో పాన్ కార్డు ద్వారానే లావాదేవీలు కొనసాగించాల్సి ఉంటుంది. అలాగే లక్ష దాటిన విదేశీ లావాదేవీలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు జైట్లీ తెలిపారు. అలాగే సంపద పన్ను రద్దు కాగా, రూ.కోటి ఆదాయం దాటిన వారిపై కేంద్రం 2 శాతం పన్ను వడ్డించింది. -
కేంద్ర ప్రభుత్వ పన్ను విధానమిదీ!
-
కార్పొరేట్ పన్ను 25 శాతానికి తగ్గింపు
న్యూఢిల్లీ : కార్పొరేట్ పన్నును కేంద్ర ప్రభుత్వం 25 శాతానికి తగ్గించింది. ఇది నాలుగేళ్లపాటు వర్తిస్తుంది. ఇంతకు ముందు కార్పొరేట్ పన్ను రేటు 30 శాతంగా ఉండేది. అయితే అంత మొత్తం పన్ను వసూలు కావటం లేదని, దాని వల్ల ఎంతో ఆదాయన్ని నష్టపోతున్నామని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. అందువల్ల కార్పొరేట్ పన్ను తగ్గిస్తున్నట్లు చెప్పారు. అలాగే నల్లధనం వెలికితీతకు కొత్త చట్టం చేయనున్నట్లు జైట్లీ పేర్కొన్నారు. -
ఆదాయ పన్ను యథాతథం.. వేతన జీవులకు నిరాశ!
మధ్యతరగతిని, ముఖ్యంగా ఉద్యోగులను ప్రసన్నం చేసుకోడానికి ఆదాయపన్ను పరిమితిని అరుణ్ జైట్లీ మరింత పెంచుతారని అందరూ భావిస్తుంటే.. వాళ్ల ఆశల మీద ఆయన నీళ్లు చల్లారు. ఆదాయపన్ను శ్లాబులలో ఎలాంటి మార్పుచేర్పులు చేయకుండా గత సంవత్సరంలాగే యథాతథంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. దాంతో గత సంవత్సరంలో ఎలాంటి పన్ను శ్లాబులు ఉన్నాయో, ఇప్పుడు కూడా అవే వర్తిస్తాయి. అయితే వెల్త్ టాక్స్ మీద మాత్రం మరో 2 శాతం అదనపు వడ్డింపు విధించారు. -
ఆంధ్రప్రదేశ్‌కు ఐఐఎం కేటాయింపు
-
ఆంధ్రప్రదేశ్‌కు ఐఐఎం కేటాయింపు
న్యూఢిల్లీ :ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (ఐఐఎం) ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు కానుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఐఐఎంను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. అలాగే జమ్మూకశ్మీర్, పంజాబ్, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్‌తో పాటు అస్సాం రాష్ట్రాల్లో ఏఐఐఎంలను కేంద్రం ఏర్పాటు చేయనుంది. -
17 లక్షల కోట్ల బడ్జెట్ ఇది..!
-
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ఆర్థిక సాయం
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక ఆర్థిక సాయం ప్రకటించింది. ఆర్థికంగా వెనుకబడిన బీహార్, పశ్చిమ బెంగాల్‌తో పాటు ఏపీకి కూడా కేంద్రం సాయం చేయనుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శనివారం బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. కాగా ఏపీతో పాటు బీహార్, పశ్చిమ బెంగాల్ కూడా ప్రత్యేక హోదాను కోరుకుంటున్న విషయం తెలిసిందే. అయితే కేంద్రం మాత్రం ఈ రాష్ట్రాలకు ప్రస్తుతం ప్రత్యేక ఆర్థిక సాయంతోనే సరిపెట్టింది. -
త్వరలో క్యాష్‌లెస్ ఇండియా....
-
'అశోక చక్ర' గోల్డ్ కాయిన్ల అమ్మకాలు
-
త్వరలో క్యాష్‌లెస్ ఇండియా....
న్యూఢిల్లీ : త్వరలో క్యాష్‌లెస్ ఇండియాను తయారు చేద్దామని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఇక నుంచి నగదు లావాదేవీలన్నీ కార్డుల ద్వారానే జరిపేలా చూద్దామని ఆయన తెలిపారు. నగదు లావాదేవీలన్నీ కార్డుల ద్వారా జరిగేలా ప్రోత్సహకాలు ఇస్తామన్నారు. నగదు లావాదేవీలు లేని దేశం వైపు అడుగులు వేద్దామని జైట్లీ అన్నారు. నల్లధనం అరికట్టేందుకు డెబిట్, క్రెడిట్ కార్డుల ఉపయోగించేలా చూద్దామన్నారు. అలాగే జన్‌ధన యోజన ఖాతాదారులకు డెబిట్ కార్డులు సదుపాయం కల్పిస్తామన్నారు. -
'అశోక చక్ర' గోల్డ్ కాయిన్ల అమ్మకాలు
ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకునే దేశాల్లో మనది ఒకటని అరుణ్ జైట్లీ చెప్పారు. ఏటా మనం 800-1000 టన్నుల బంగారం దిగుమతి చేసుకుంటామని, అయితే ఇది ఎక్కడా ట్రేడింగ్ కావట్లేదని అన్నారు. ఇందుకోసం గోల్డ్ డిపాజిట్ల స్థానంలో గోల్డ్ మినిమైజ్ అనే కొత్త పథకం ప్రవేశపెడతామన్నారు. బంగారాన్ని డిపాజిట్ చేసుకుంటే ఆదాయం కూడా వస్తుందని, గోల్డ్ బాండ్ కొనుగోలు చేస్తే దానికి నిర్దేశిత వడ్డీ ఇస్తామని అన్నారు. అలాగే కొత్తగా అశోక చక్ర పేరుతో ఇండియన్ గోల్డ్ కాయిన్స్ ముద్రిస్తామని జైట్లీ చెప్పారు. దీనివల్ల విదేశాల్లో ముద్రించే బంగారానికి డిమాండ్ తగ్గుతుందన్నారు. నల్లధనాన్ని నియంత్రించడానికి క్రెడిట్, డెబిట్ కార్డుల ఉపయోగానికి మరిన్ని ప్రోత్సాహకాలు కల్పిస్తామని, క్యాష్‌లెస్ ఇండియా రూపొందించడానికి ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. -
ద్రవ్యోల్బణాన్ని జయించాం....
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుంటే...భారత్ ద్రవ్యోల్బణాన్ని జయించిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. వృద్ధి రేటును త్వరలోనే రెండంకెలకు తీసుకు వెళతామన్నారు. ఇతర దేశాలతో పోల్చితే రూపాయి బలపడిందని జైట్లీ తెలిపారు. ఆర్థిక క్రమ శిక్షణ కత్తిమీద సాములాంటిదేనని ఆయన అన్నారు. రాయితీల్లోని లోపాలు సవరిస్తామే కానీ...రాయితీలు కాదని జైట్లీ పేర్కొన్నారు. రాష్ట్రాలను అభివృద్ధిలో భాగస్వాములను చేస్తామని ఆయన తెలిపారు. . పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పథకాలు రూపొందిస్తున్నామన్నారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం నాటికి భారత్ శక్తివంతమైన దేశంగా మారుతుందన్నారు. -
రూపాయి ప్రీమియంతో.. 2లక్షల బీమా!
-
మైనారిటీల అభివృద్ధికి.. నయీ మంజిల్!
-
నెలకు రూపాయి ప్రీమియంతో రూ. 2 లక్షల ప్రమాదబీమా
దేశంలో చాలామందికి ఎలాంటి ఆరోగ్య, ప్రమాద, జీవిత బీమా లేదని, చాలా మందికి పింఛను కూడా రావట్లేదని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ఇందుకోసం త్వరలోనే ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన పథకాన్ని ప్రవేశపెడుతున్నామన్నారు. దీనికింద ఏడాదికి 12 రూపాయల ప్రీమియంతో.. అంటే, నెలకు రూపాయి ప్రీమియంతో రూ. 2 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు. అంటే, ఈ ప్రీమియం కట్టినవాళ్లు ఎవరైనా ప్రమాదాల్లో మరణిస్తే, వాళ్ల కుటుంబాలకు రూ. 2 లక్షలు ఇస్తారన్నమాట. ప్రధానమంత్రి జనధన యోజన కింద అందరికీ సామాజిక భద్రత కల్పించాలన్నదే తమ ఉద్దేశమని, అందులో భాగంగా పింఛను సదుపాయం కూడా ఇస్తామన్నారు. ప్రతినెలా ఈ ఖాతాలో పేదలు ఎంత ఆదా చేస్తే అందులో సగం మళ్లీ ప్రభుత్వం కూడా కలుపుతుందని, 60 ఏళ్ల వయసు దాటినప్పటినుంచి వారికి పింఛను వస్తుందని అన్నారు. అలాగే, 18-50 ఏళ్ల మధ్యవారికి ఏడాదికి రూ. 335 ప్రీమియంతో మరో ప్రమాదబీమా కల్పిస్తామన్నారు. సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటుచేస్తామని, వృద్ధుల కోసం ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. -
ఉన్నత వర్గాలకు గ్యాస్ రాయితీ ఎత్తివేత
న్యూఢిల్లీ : ఉన్నత ఆదాయ వర్గాలకు గ్యాస్ రాయితీని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. అలాగే ఎంపీలు స్వచ్ఛందంగా గ్యాస్ రాయితీని వదులుకోవాలని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో సూచించారు. ఇప్పటివరకూ పేద, మధ్య తరగతి ప్రజలతో పాటు ఉన్నత వర్గాలకు కూడా కేంద్రం వంట గ్యాస్‌లో రాయితీ ఇస్తున్న విషయం తెలిసిందే. గ్యాస్ సిలిండర్ పై ప్రభుత్వం ఇచ్చే రాయితి ఇక నుంచి ఎంపీలు వదులుకోవాల్సిందే. -
కావాలంటే కూర్చుని చదవండి...
-
2022 నాటికి అందరికీ ఇళ్లు
న్యూఢిల్లీ: లోక్ సభలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగం కొనసాగుతోంది. భారత్ ఆర్థిక వృద్ధికి ప్రజల భాగస్వామ్యం కావాలన్నారు. 2022 నాటికి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లవుతుంది..అప్పటికి దేశంలో ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు. పట్టణ భారతంలో 2 కోట్ల ఇళ్లు, గ్రామీణ భారతంలో 4 కోట్ల ఇళ్లు కట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రితెలిపారు. ప్రతి ఇంటికీ 24 గంటల విద్యుత్ సరఫరా, నీటి సరఫరా ఉండాలని అనుకుంటున్నాం. దేశంలో మిగిలిన 20 వేల గ్రామాలకు కూడా విద్యుత్ సరఫరా కోసం సౌర విద్యుత్ కల్పించాలని భావిస్తున్నాం. అలాగే ఆరు కోట్ల టాయిలెట్లను నిర్మించాలన్న తమ ప్రభుత్వ టార్గెట్ ను రీచ్ అయ్యేందుకు కృషిచేస్తున్నామన్నారు. ఇప్పటికే 50 లక్షల మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయిందని ప్రకటించారు. -
'ఇండియాను తయారీ కేంద్రంగా మార్చుతాం'
న్యూఢిల్లీ : ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. భారత్‌ను తయారీ కేంద్రంగా మార్చుతామని ఆయన తెలిపారు. తొమ్మిది నెలలుగా వృద్ధి రేటును పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వేగవంతమైన అభివృద్ధితో పాటు పారదర్శక పాలను ప్రజలు కోరుకుంటున్నారని జైట్లీ తెలిపారు. భారత్‌లో పెట్టుబడులకు దేశాలు ఆసక్తి చూపుతున్నాయన్నారు. 80వేల స్కూళ్లను అప్‌గ్రేడ్ చేస్తామన్నారు. ప్రతి అయిదు కిలోమీటర్లకు ఓ స్కూల్‌తో పాటు 10 కిలోమీటర్ల కాలేజీలు ఏర్పాటు చేస్తామన్నారు. -
కావాలంటే కూర్చుని చదవండి..
గత సంవత్సరం బడ్జెట్ ప్రసంగం చదివేటప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి తీవ్రమైన నడుంనొప్పి రావడంతో ఆయన స్పీకర్ అనుమతి తీసుకుని కూర్చుని బడ్జెట్ ప్రసంగం పూర్తిచేశారు. శనివారం కూడా ఆయన బడ్జెట్ ప్రసంగం ప్రారంభించిన 20 నిమిషాల తర్వాత మధ్యలో స్పీకర్ సుమిత్రా మహాజన్ కలగజేసుకుని.. కావాలంటే కూర్చుని బడ్జెట్ చదవొచ్చని అరుణ్ జైట్లీకి సూచించారు. అయితే.. తనకు అవసరమైతే తప్పకుండా అనుమతి తీసుకుని కూర్చుంటానని జైట్లీ సమాధానమిచ్చారు. కాసేపటి తర్వాతే ఆయన కూర్చుని తన ప్రసంగాన్ని కొనసాగించారు. -
ప్రతి ఇంట్లో ఒకరికైనా ఉద్యోగం
న్యూఢిల్లీ : దేశంలో సోలార్ పవర్ వ్యవస్థను అభివృద్ధి చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖమంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. బడ్జెట్ ప్రసంగంలో భాగం ఆయన మాట్లాడుతూ విద్యవ్యవస్థను మెరుగుపరిచేందుకు కృషి చేస్తామన్నారు. పేదరిక నిర్మూలనతో పాటు, నిరుద్యోగ సమస్యను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అమ్మాయిలు చదువుపై దృష్టి పెట్టాలన్నారు. అలాగే యువతలో నైపుణ్యం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఇండియాను తయారీ కేంద్రంగా మార్చుతామని అరుణ్ జైట్లీ తన ప్రసంగంలో వెల్లడించారు. ప్రతి కుటుంబంలో ఒక్కరికైనా ఉద్యోగం కలిగి ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. 2020 నాటికి పూర్తిస్థాయి విద్యుద్దీకరణకు కృషి చేస్తామన్నారు. -
ప్రీ బడ్జెట్ చర్చ : సంస్కరణలా ? సంక్షేమమా ?
-
దారిలో ముళ్లు తొలగించుకోవాలి
తమ దారిలో ముళ్లు తొలగించుకోవాల్సి ఉందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. నీలిరంగు బంద్ గలా నెహ్రూ కోటు వేసుకుని వచ్చిన ఆయన.. ఈసారి నిలబడే బడ్జెట్ ప్రసంగం చేశారు. ఆయన ఏం చెప్పారంటే.. దేశం ఇప్పటికే అనేక సవాళ్లు ఎదుర్కొంటోంది. రాష్ట్రాలు ఇంతకుముందుకంటే చాలా బలోపేతం అయ్యాయి. ప్రజల కోసం ఖర్చుపెట్టే ప్రతి పైసాతో ఉద్యోగావకాశాల కల్పన లాంటి ప్రయోజనాలు ఉంటాయి. ''ఇప్పటికి కొన్ని పూలు పూయించాం.. మరికొన్ని పూయించాల్సి ఉంది, కానీ ఈ దారిలో తోటలో ముళ్లు చాలా తొలగించాల్సి ఉంది'' అన్నారు. మాది రోజుకు 24 గంటలూ, ఏడాదికి 265 రోజులూ పనిచేసే ప్రభుత్వం. కరెంటు ఖాతా లోటు జీడీపీలో 1.3 శాతం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది. జీడీపీ బాగా పెరగుతోంది. దాంతో భారతదేశం ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థలలో భాగంగా కనిపిస్తోంది. రూపాయి 6.4 శాతం బలోపేతం అయ్యింది. మనది మేజర్ ఎకానమీలలో రెండో అతిపెద్ద స్టాక్ మార్కెట్. భారత ప్రజలు మంచి అవకాశం ఇచ్చారు. మా చర్యలు కేవలం ప్రధాన రంగాలకే పరిమితం కాలేదు. బాలికల విద్య, యువతకు ఉపాధి, పన్నుల సంస్కరణలు, పెట్టుబడులు, ఉద్యోగావకాశాల కల్పన, డిజిటల్ కనెక్టివిటీ, ప్రభుత్వంలో మెరుగైన పనితీరు, ఈశాన్య రాష్ట్రాల్లో మెరుగైన కనెక్టివిటీ అన్నీ ఉండాలనుకుంటున్నాం. అభివృద్ధిలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలి. స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ఓ ఉద్యమంలా తీసుకొస్తాం. ఇప్పటికే 2014-15లో 50 లక్షల టాయిలెట్లు కట్టించాం. మొత్తం 6 కోట్ల టాయిలెట్లు కట్టాలన్నది లక్ష్యం. ఈ 9 నెలల్లో ఆర్థికరంగాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేశాం. జనధన్ యోజనతో ప్రజలకు ప్రయోజనాలను నేరుగా అందిస్తాం. ద్రవ్యోల్బణాన్ని అధిగమించడం మా ప్రభుత్వం సాధించిన మరో విజయం. ఈ ఏడాది ఆర్బీఐ చట్టాన్ని సవరిస్తాం. రెండంకెల వృద్ధిరేటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 2022 నాటికి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లవుతుంది. అప్పటికి దేశంలో ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యం. పట్టణ భారతంలో 2 కోట్ల ఇళ్లు, గ్రామీణ భారతంలో 4 కోట్ల ఇళ్లు కట్టాలని లక్ష్యం పెట్టుకున్నాం. ప్రతి ఇంటికీ 24 గంటల విద్యుత్ సరఫరా, నీటి సరఫరా ఉండాలని అనుకుంటున్నాం. దేశంలో మిగిలిన 20 వేల గ్రామాలకు కూడా విద్యుత్ సరఫరా కోసం సౌర విద్యుత్ కల్పించాలని భావిస్తున్నాం. -
లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన జైట్లీ
-
లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అరుణ్ జైట్లీ
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శనివారం 2015-16 ఆర్థిక సంవత్సరానికి లోక్ సభలో సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌పై అన్నివర్గాల ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు, పారిశ్రామిక వర్గాలు బడ్జెట్ ప్రతిపాదనల కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంతో రెండోసారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న అరుణ్ జైట్లీ ఈసారి కూడా తమను కరుణిస్తారని, ఆదాయం పన్ను మినహాయింపులను పెంచుతారని, శ్లాబుల్లో కూడా సవరణలు తీసుకొచ్చి రాయితీలను పెంచుతారని ఉద్యోగస్థులు ఆశిస్తున్నారు. -
వాహన ధరలు తగ్గే అవకాశం!
న్యూఢిల్లీ : కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టబోయే సాధారణ బడ్జెట్‌పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. గత కొద్ది రోజులుగా అందరూ ఆసక్తిగా చర్చించుకుంటున్న బడ్జెట్ శనివారం విడుదల అయ్యింది. దీనిపై సామాన్యుల నుంచి ఆర్థికరంగ నిపుణుల వరకు ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. దేశ రాజధానిలో ఇటీవలి జరిగిన ఎన్నికల్లో సామాన్యుడి చేతిలో భంగపడ్డ మోడీ సర్కారు.. ఇప్పుడు ఈ బడ్జెట్ ద్వారా సామాన్యులని ఎలా ప్రసన్నం చేసుకుంటుంది.. అనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న. బడ్జెట్ అంచనాలు ఈ క్రింద విధంగా ఉన్నాయి. * బడ్జెట్లో పన్ను ప్రోత్సహకాలకు అవకాశం * పన్నుల రాబడులకు 'ట్యాక్స్' బేస్ ను పెంచే అవకాశం * ఆరోగ్య బీమా పథకాల్లో పన్ను రాయితీలు ఉంటాయని అంచనా *మోదీ 'మేక్ ఇన్ ఇండియా'నే లక్ష్యంగా బడ్జెట్! *పన్ను మినహాయింపు వర్తించే వార్షికాదాయం పరిమితి పెంచే ఛాన్స్ * భారీ పెట్టుబడులు భారత్‌కు వచ్చేలా బడ్జెట్ రూపకల్పన! * బంగారంపై 1% వ్యాట్ పెంచే అవకాశం * ముడి చమురుపై కస్టమ్స్ సుంకాన్ని తిరిగి విధించే సూచన * డిజిన్వెస్టిమెంట్ టార్గెట్ రూ.75 వేల కోట్ల లక్ష్యం * ఉక్కు దిగుమతులపై భారీ రాయితీలు ఇచ్చే అవకాశం * రియల్ ఎస్టేట్‌కు భారీ రాయితీలు ఇచ్చే అవకాశం * ఫార్మా కంపెనీలకు భారీ ప్రోత్సహకాలు! * పెట్రో రంగంలో పెట్టుబడులకు పెద్దపీట! * వాహన ధరలు తగ్గే అవకాశం * వాహన తయారీ రంగంలో ఎక్సైజ్ పన్ను తగ్గే అవకాశం -
మరికాసేపట్లో పార్లమెంట్‌కు కేంద్ర బడ్జెట్
-
రాష్ట్రపతిని కలిసిన అరుణ్ జైట్లీ
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శనివారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ..రాష్ట్రపతి భవన్లో కలిశారు. నేడు పార్లమెంట్ లో అరుణ్ జైట్లీ సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. దాంతో బడ్జెట్ వివరాలను రాష్ట్రపతికి వివరించినట్లు సమాచారం. బడ్జెట్ ప్రవేశపెట్టబోయే ముందు ఆర్థిక మంత్రి ...రాష్ట్రపతిని కలవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన...ప్రణబ్‌ను కలిశారు. అనంతరం అరుణ్ జైట్లీ పార్లమెంట్‌కు బయల్దేరారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ఆయన లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఎన్డీఏ ప్రవేశపెట్టనున్న పూర్తిస్థాయి తొలి బడ్జెట్ పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. -
10.15గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ
న్యూఢిల్లీ : కేంద్ర కేబినెట్ శనివారం ఉదయం 10.15 గంటలకు సమావేశం కానుంది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈరోజు కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బడ్జెట్‌కు కేంద్ర మంత్రివర్గం లాంఛనప్రాయంగా ఆమోదించనుంది. మరోవైపు బడ్జెట్‌ను అరుణ్ జైట్లీ ఉదయం 11 గంటలకు సభలో ప్రవేశపెడతారు. కాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది రెండో బడ్జెట్. ఈసారి పలు సంస్కరణలు ప్రవేశపెడతారని అంచనా వేస్తున్నారు. -
ఉదయం 11 గంటలకే కేంద్ర బడ్జెట్
నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రెండోసారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఉదయాన్నే నార్త్ బ్లాక్‌కు చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ఇందుకు సంబంధించిన కసరత్తులన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. గత సంవత్సరం తీవ్రమైన నడుం నొప్పి కారణంగా స్పీకర్ అనుమతితో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కూర్చునే తన బడ్జెట్ ప్రసంగాన్ని చదవడం విశేషం. ఆ తర్వాత ఆయనకు శస్త్రచికిత్స కూడా జరిగింది. దాంతో ఈసారి నిలబడి చదువుతారా.. లేదా మళ్లీ కూర్చుని చదువుతారా అనే విషయం ఆసక్తికరంగా మారింది. -
బడ్జెట్లో హల్వా ఎందుకు?
న్యూఢిల్లీ : పానకంలో పుడకలా... దేశం ఆదాయ వ్యయాల గురించి మాట్లాడుతుంటే మధ్యలో ఈ స్వీటు గొడవవేంటీ అనుకుంటున్నారా? ఇదీ బడ్జెట్లో భాగమే! అవును, బడ్జెట్ పత్రాలు సిద్ధమయ్యాక పార్లమెంట్ నార్త్‌బ్లాక్‌లో హల్వా హడావుడి మొదలవుతుంది. బడ్జెట్ రూపకల్పనలోని చివరి అంకం ఈ మిఠాయితోనే ఆరంభమౌతుంది. పత్రాలన్నీ సిద్ధమయ్యాక... ప్రింటింగ్‌కి పంపించే ముందు బడ్జెట్ రూపకల్పనలో భాగస్వామ్యులైన అధికారులందరూ హల్వా వండుకుని తింటారు. మామూలుగా అయితే, మన సంప్రదాయం ప్రకారం ఏపనినైనా పూజ చేసి మొదలుపెడతాం. కానీ, బడ్జెట్ పత్రాల ప్రింటింగ్‌కు ముందు అలాంటివేవీ ఉండవు. హల్వా పంచుకుని తినడమే అసలైన పండగ. ప్రింటింగ్ ఎక్కడ? బడ్జెట్ రూపొందించడం ఎంత పకడ్బందీగా జరుగుతుందో... ఆ పత్రాల ముద్రణ కూడా అంతే రహస్యంగా జరుగుతుంది. నిజానికి ప్రభుత్వానికి సంబంధించిన అన్ని రకాల పత్రాలూ ప్రభుత్వ ముద్రణాలయాల్లో జరుగుతాయి. కానీ, బడ్జెట్ పత్రాలు మాత్రం అలా కాదు. పార్లమెంట్‌లోని నార్త్‌బ్లాక్‌లో ఒక ప్రత్యేకమైన ముద్రణా యంత్రంలో మాత్రమే వీటిని ముద్రిస్తారు. మొదట్లో... అంటే, 1947 నుంచి 1950 వరకూ బడ్జెట్ పత్రాలను రాష్ట్రపతి భవన్లో ముద్రించేవారు. 1950 తరువాత ప్రింటింగ్‌ను మౌంట్‌రోడ్‌లోని గవర్నమెంట్ ప్రెస్‌కి మార్చాల్సి వచ్చింది. కారణం... ఆ ఏడాది బడ్జెట్ పత్రాల్లోని సమాచారం ముందుగానే లీక్ కావడం! తరువాత, 1980 నుంచి బడ్జెట్ పత్రాల ముద్రణ కోసం ప్రత్యేకమైన ప్రెస్‌ను నార్త్‌బ్లాక్‌లో ప్రారంభించారు. ఈ ‘బడ్జెట్ ప్రెస్’ హాలు అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించారు. పూర్తి ఎయిర్ కండిషన్డ్, మోడరన్ మెషీన్స్, జామర్లు, సీసీ కెమెరాలు... బయట నుంచి చిన్న చీమ కూడా లోపలికి రాని విధంగా దీన్ని నిర్మించారు. -
బడ్జెట్ టీమ్‌లో ఎవరుంటారు?
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ టీమ్ లో ఎవరుంటారో తెలుసా? ఇప్పటికీ చాలా ఆర్థిక బడ్జెట్ లు మనకు సుపరిచితమే అయినా అసలు ఆ టీమ్ లో ఎవరుంటారనేది దానిపై సందేహాలు ఉండక మానవు. * మొదటి టీమ్ (పొలిటికల్): అరుణ్‌జైట్లీ, జయంత్ సిన్హా, ఎన్.ఐ.టి.ఐ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా, ఆర్థిక సలహాదారులు అరవింద్ సుబ్రమణియన్. *రెండోటీమ్ (అధికారిక): ఎఫ్.ఎస్. మెహ్రిషి, రెవెన్యూ సెక్రటరీ శక్తికంటా దాస్, ఫైనాన్షియల్ సెక్రెటరీ డా.హస్ముక్ అద్హియా, డిసిన్వెస్ట్మెంట్ సెక్రటరీ అరదాన జోహ్రి, సీబీడీటీ చైర్ పర్సన్ కపూర్, సీబీఈసీ చైర్పర్సన్ కౌషల్ శ్రీవాత్సవ్, ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన వ్యక్తిగా రజత్ భార్గవ, జేఎస్‌లు ఉంటారు. -
మొట్టమొదటి బడ్జెట్ ఎప్పుడో.. ఎవరో తెలుసా?
స్వతంత్ర భారత దేశానికి మొట్టమొదటి బడ్జెట్ ప్రవేశపెట్టింది ఎవరో తెలుసా? నాటి ఆర్థికమంత్రి షణ్ముఖం చెట్టి. ఆయనే 1948-49 సంవత్సరంలో తాత్కాలిక బడ్జెట్, ఇంటెరిమ్ బడ్జెట్ అనే పదాన్ని మొదటిసారి తన బడ్జెట్ ప్రసంగంలో పరిచయం చేశారు. ఈస్టిండియా కంపెనీ నుంచి అధికార పగ్గాలు బ్రిటిష్ ప్రభుత్వానికి చేతులు మారిన తర్వాత వార్షిక బడ్జెట్‌ను తొలిసారిగా 1860 ఏప్రిల్ 7న ప్రవేశపెట్టింది. బడ్జెట్‌ను సాయంత్రం 5 గంటల సమయంలో వెలువరించడం అనే సంప్రదాయాన్ని 1924లో సర్ బాసిల్ బ్లాకెట్ ప్రారంభించారు. బడ్జెట్ తయారీకి రాత్రంతా పనిచేసిన ఉద్యోగులకు కొంత ఉపశమనం ఇవ్వాలనే ఉద్దేశంతో అప్పట్లో ఆ నిర్ణయం తీసుకున్నారు. తర్వాత క్రమంగా అది ఉదయానికి మారిపోయింది. బడ్జెట్ చరిత్ర మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటి ఆర్థిక మంత్రి ఆర్.కె. షణ్ముఖం చెట్టి 1947 నవంబర్ 26 సాయంత్రం 5 గంటలకు తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. స్వతంత్ర భారతదేశ మొదటి బడ్జెట్‌ను కేవలం ఏడున్నర నెలలకు మాత్రమే రూపొందించారు. దీనిని 1947 ఆగస్టు 15 నుంచి 1948 మార్చి 31 వరకు రూపొందించారు. గణతంత్ర భారతదేశంలో మొట్టమొదటి బడ్జెట్‌ను 1950 ఫిబ్రవరి 28న జాన్ మత్తయ్ సమర్పించారు. -
జైట్లీ బడ్జెట్ ఇలా ఉంటుందా!
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శనివారం 2015-16 ఆర్థిక సంవత్సరానికి పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న సాధారణ బడ్జెట్‌పై అన్నివర్గాల ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు, పారిశ్రామిక వర్గాలు బడ్జెట్ ప్రతిపాదనల కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంతో రెండోసారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న అరుణ్ జైట్లీ ఈసారి కూడా తమను కరుణిస్తారని, ఆదాయం పన్ను మినహాయింపులను పెంచుతారని, శ్లాబుల్లో కూడా సవరణలు తీసుకొచ్చి రాయితీలను పెంచుతారని ఉద్యోగస్థులు ఆశిస్తున్నారు. అలాగే పన్ను మినహాయింపుల ద్వారా పొదుపు చర్యలను ప్రోత్సహించాలని కోరుకుంటున్నారు. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల భారం లేకుండా గృహరుణాలకు మరింత రాయితీలు కల్పించాలని, 80 సీ కింద పన్ను మినహాయింపు పరిమితులను పెంచాలని మధ్యతరగతి వారు ఆశిస్తున్నారు. ఆర్థిక శాఖతోపాటు కార్పొరేట్ వ్యవహారాలు, సమాచార, ప్రసారాల శాఖలను కూడా జైట్లీ నిర్వహిస్తున్నందున బడ్జెట్లో తమకూ న్యాయం జరుగుతుందని ఆయా వర్గాలు విశ్వసిస్తున్నాయి. 2014లో తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అరుణ్ జైట్లీ రూ. 2 లక్షలుగా ఉన్న ఆదాయం పన్ను రాయితీని రూ. 2.5 లక్షలకు పెంచడంతోపాటు పన్ను శ్లాబుల్లో రాయితీలను పెంచారు. పలు సందర్భాల్లో ఆదాయం పన్ను రాయితీలను పెంచుతామని అరుణ్ జైట్లీయే స్వయంగా ప్రకటించినందున ప్రస్తుతమున్న రూ. 2.5 లక్షల ఆదాయం పన్ను కనీస పరిమితిని కనీసం రూ. 3 లక్షలకు పెంచడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే శ్లాబుల్లోనూ మార్పులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. తగ్గుతున్న ఆదాయ వనరులను పెంచుకోవడానికి పరోక్ష పన్నులను పెంచవచ్చని, క్రూడాయిల్ (ముడి చమురు) దిగుమతులపై ఎత్తేసిన కస్టమ్స్ సుంకాన్ని తిరిగి విధించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు బ్యారెల్‌కు 120 డాలర్లు చేరుకున్న నేపథ్యంలో 2011, జూన్‌లో కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ సుంకాన్ని ఎత్తేసింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో దీని ధర బ్యారెల్‌కు 60 డాలర్లకు చేరుకున్నందున తిరిగి సుంకం విధించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. క్రూడాయిల్‌పై ఐదు శాతం సుంకం విధించినా కూడా రూ. 18 వేల కోట్ల ఆదాయం సమకూరుతుంది. దేశీయంగా ఉత్పత్తవుతున్న క్రూడాయిల్‌పై రెండు శాతం పన్ను ఇప్పటికీ అమల్లో ఉంది. క్రూడాయిల్ వినియోగంలో మనం 80 శాతం వరకు దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. సుంకం విధింపు వల్ల అనివార్యంగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతాయి. అధిక ఆదాయం పన్ను శ్లాబుల్లో ఉన్నవారికి వంట గ్యాస్ (ఎల్పీజీ) సబ్సిడీని పూర్తిగా ఎత్తివేసే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ దిశగా గత ఆరునెలలుగా సంబంధిత శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు మాట్లాడుతూనే ఉన్నారు. ప్రస్తుతం ఎల్పీజీ సిలిండర్లపై సబ్సిడీ కారణంగా 20 నుంచి 30 శాతం వరకు భారాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. సరుకులు, సేవా పన్నులను పెంచడం ద్వారా ప్రత్యక్ష పన్నులను స్థిరీకరించవచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. సేవా పన్నును 12 నుంచి 14 శాతానికి పెంచవచ్చని వారి అంచనా. అదే జరిగితే ఫోన్ కాల్స్ చార్జీలు, హోటళ్లలో ఆహార పదార్థాల ధరలు పెరుగుతాయి. జిమ్‌లు ప్రియమవుతాయి. క్లబ్ మెంబర్‌షిప్పులు భారమవుతాయి. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఇప్పటికే తగ్గినందున పది శాతం ఉన్న దిగుమతి సుంకాన్ని తగ్గించే సూచనలు కనిపించడం లేదు. ఆటోమొబైల్ రంగం ఎక్సైజ్ సుంకం తగ్గింపును కోరుకుంటున్నా.. ఆ దిశగా చర్యలు ఉండకపోవచ్చని ఆర్థిక నిపుణుల అభిప్రాయం.