గత సంవత్సరం బడ్జెట్ ప్రసంగం చదివేటప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి తీవ్రమైన నడుంనొప్పి రావడంతో ఆయన స్పీకర్ అనుమతి తీసుకుని కూర్చుని బడ్జెట్ ప్రసంగం పూర్తిచేశారు. శనివారం కూడా ఆయన బడ్జెట్ ప్రసంగం ప్రారంభించిన 20 నిమిషాల తర్వాత మధ్యలో స్పీకర్ సుమిత్రా మహాజన్ కలగజేసుకుని.. కావాలంటే కూర్చుని బడ్జెట్ చదవొచ్చని అరుణ్ జైట్లీకి సూచించారు. అయితే.. తనకు అవసరమైతే తప్పకుండా అనుమతి తీసుకుని కూర్చుంటానని జైట్లీ సమాధానమిచ్చారు. కాసేపటి తర్వాతే ఆయన కూర్చుని తన ప్రసంగాన్ని కొనసాగించారు.