కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ శనివారం లోక్సభలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ను చారిత్రాత్మకం అంటూ స్వపక్షంవారు ఆకాశానికెత్తగా.. విపక్షం వారు విమర్షలు గుప్పించారు. ఇది చారిత్రాత్మక బడ్జెట్ అని, పేదల బడ్జెట్ అని, పేదల కొరకు తయారు చేసిన బడ్జెట్ అని బీజేపీ అనగా.. అసలు పేదలనే పూర్తిగా విస్మరించారంటూ కాంగ్రెస్ నేతలు విమర్శించారు. పూర్తిగా అమలు చేసుకోదగిన బడ్జెట్ అని ప్రధాని నరేంద్రమోదీ అనగా.. అసలు ఆచరణ సాధ్యం కాదని విపక్షం వారన్నారు.. ఇలా బడ్జెట్పై వివిధ పార్టీలవారు వెలిబుచ్చిన ప్రతిస్పందనలు వారి మాటల్లోనే....
బడ్జెట్పై అధికారపక్ష ప్రతిస్పందనలు..
ప్రధాని నరేంద్రమోదీ(భారత ప్రధాని)
'ఇది స్పష్టమైన దృష్టిని కలిగిన బడ్జెట్. ఇందులో రైతులు, యువకులు, పేదలు, మధ్యతరగతి, అందరిని దృష్టిలో పెట్టుకున్నారు. సమన్యాయం, వృద్ధి, ఉద్యోగితవంటి అంశాలను పొందుపరిచారు. ప్రగతి పూర్వక, సానుకూలత, ఆచరణకు అనుకూలమైన బడ్జెట్ ఇది.
రాజ్నాథ్ సింగ్ (కేంద్ర హోంమంత్రి)
ఆధునిక భారతాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు చాలా ఉపయోగపడే బడ్జెట్ ఇది. దేశంలోని పేదరికాన్ని, నిరుద్యోగితను రూపుమాపడానికి ఉపయోగపడుతుంది.
మనోహర్ పారికర్ (రక్షణశాఖ మంత్రి)
జైట్లీ ఆయన విద్యుక్త ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించారు. ఆయనకు ఈ విషయంలో నేను 10 కి 9.5 మార్కులు వేస్తాను.
ప్రకాశ్ జవదేకర్ (పర్యావరణశాఖ మంత్రి)
ఇది చారిత్రాత్మక బడ్జెట్. అన్ని వర్గాల ప్రజలకు సామాజిక భద్రతను కల్పిస్తుంది. ఇది పేద ప్రజల బడ్జెట్. పేదల కోసం తయారుచేసిన బడ్జెట్.
నితిన్ గడ్కరీ (కేంద్ర మంత్రి)
మొత్తం చరిత్రలోనే మౌలిక సదుపాయాలకు పెద్ద పీఠవేసిన మొట్ట మొదటి బడ్జెట్ ఇదే. దీని ద్వారా దేశంలో ఉద్యోగిత, అవకాశాలు పెరుగుతాయి. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయం మరింత మెరుగవనుంది.
వెంకయ్యనాయుడు (కేంద్రమంత్రి)
ఈ బడ్జెట్తో ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు. ఇది ఆమ్ జాంతా బడ్జెట్. ఎంతో ప్రోత్సాహకంగా, కొత్త ఆవిష్కరణలు జరిగేలాగా ఇది ఉంది.
రాజ్యవర్ధన్ రాథోడ్ (బీజేపీ)
దేశంలోని యువకుల నుంచి పెద్దవారి వరకు అందరిని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన బడ్జెట్ ఇది. దేశ ప్రయోజనాలన్నింటిని దృష్టిలో పెట్టుకుంది.
బడ్జెట్పై విపక్షాల ప్రతి స్పందనలు..
మన్మోహన్సింగ్ (మాజీ ప్రధాని, కాంగ్రెస్)
ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశ పెట్టిన బడ్జెట్ విషయంలో నాకు ఎలాంటి ఆందోళన లేదు. అందులో ఉద్దేశాలు బాగున్నాయి. కాకపోతే వాటి అమలుకు మాత్రం ప్రభుత్వం వద్ద సరైన రోడ్ మ్యాప్ ఉన్నట్లు నాకు అనిపించడం లేదు.
పీసీ చాకో (కాంగ్రెస్)
ఈ బడ్జెట్ నన్ను తీవ్రంగా నిరాశపరిచింది. వాళ్లు ఇంకా పలు వారు చాలా పనులు చేయాల్సి ఉంది.
మల్లికార్జున ఖార్గే (కాంగ్రెస్)
సాధరణ పౌరులను ఈ బడ్జెట్ దృష్టిలో పెట్టుకోలేదు. ఇదొక విజన్ డాక్యుమెంట్ మాత్రమే. ముమ్మాటికీ కార్పొరేటర్లు, పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉన్న బడ్జెట్ మాత్రమే తప్ప మరొకటి కాదు.
కమల్నాథ్ (కాంగ్రెస్)
ఇది కమిషన్ల, కమిటీల, హామీల బడ్జెట్ మాత్రమే తప్ప మరొకటి కాదు.
మనీశ్ తివారీ (కాంగ్రెస్)
ఉద్దేశాలు గొప్పగా ఉన్నా.. కేటాయింపులు మాత్రం తక్కువగా ఉన్నాయి.
అశ్వనీ కుమార్ (కాంగ్రెస్)
ఇది అంకెల గారడి బడ్జెట్ మాత్రమే.
శశి థరూర్ (కాంగ్రెస్)
ఆర్థికమంత్రిగారు పేదలను పూర్తిగా విస్మరించారు. ఇది కార్పొరేట్ ఫ్రెండ్లీ బడ్జెట్. కేరళకు మాత్రం ఇది మంచి వార్తే. అక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పీచ్ అండ్ హియిరింగ్ను ప్రత్యేక అవసరాలుగల వారికి ప్రత్యేక విశ్వవిద్యాలయంగా మార్చడం మంచిదే.
మాయావతి (బీఎస్పీ)
ఇది పేదలకు వ్యతిరేకమైన బడ్జెట్ ఇది. ఈ బడ్జెట్ ఆచరణలో సాధ్యం కాదు. దేశంలోని పేదలు, సామాన్యుల ఆశలకు తగినట్లుగా లేదు.
సుప్రియా సులే(ఎన్సీపీ)
ఇది ముమ్మాటికి విమర్షించాల్సిన బడ్జెటే. ప్రజలకు వారు ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది.
జై పాండా (బీజేడీ)
ఇదొక బిగ్ బ్యాంగ్ బడ్జెట్. ఒడిశాకు వారు కొత్తగా కేటాయించిందేమీ లేదు. మా పక్క రాష్ట్రాలు ఎన్నో కేటాయింపులు పొందాయి. అలాంటి కేటాయింపులు పొందాల్సిన అవసరాలు మాకు చాలా ఉన్నాయి.
అమలు చేసుకునేదే.. కాదు చేయలేనిది..
Published Sat, Feb 28 2015 3:42 PM | Last Updated on Sat, Sep 2 2017 10:05 PM
Advertisement
Advertisement