
2022 నాటికి అందరికీ ఇళ్లు
న్యూఢిల్లీ: లోక్ సభలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగం కొనసాగుతోంది. భారత్ ఆర్థిక వృద్ధికి ప్రజల భాగస్వామ్యం కావాలన్నారు. 2022 నాటికి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లవుతుంది..అప్పటికి దేశంలో ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు.
పట్టణ భారతంలో 2 కోట్ల ఇళ్లు, గ్రామీణ భారతంలో 4 కోట్ల ఇళ్లు కట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రితెలిపారు. ప్రతి ఇంటికీ 24 గంటల విద్యుత్ సరఫరా, నీటి సరఫరా ఉండాలని అనుకుంటున్నాం. దేశంలో మిగిలిన 20 వేల గ్రామాలకు కూడా విద్యుత్ సరఫరా కోసం సౌర విద్యుత్ కల్పించాలని భావిస్తున్నాం. అలాగే ఆరు కోట్ల టాయిలెట్లను నిర్మించాలన్న తమ ప్రభుత్వ టార్గెట్ ను రీచ్ అయ్యేందుకు కృషిచేస్తున్నామన్నారు. ఇప్పటికే 50 లక్షల మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయిందని ప్రకటించారు.