
ప్రతి ఇంట్లో ఒకరికైనా ఉద్యోగం
న్యూఢిల్లీ : దేశంలో సోలార్ పవర్ వ్యవస్థను అభివృద్ధి చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖమంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. బడ్జెట్ ప్రసంగంలో భాగం ఆయన మాట్లాడుతూ విద్యవ్యవస్థను మెరుగుపరిచేందుకు కృషి చేస్తామన్నారు. పేదరిక నిర్మూలనతో పాటు, నిరుద్యోగ సమస్యను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అమ్మాయిలు చదువుపై దృష్టి పెట్టాలన్నారు.
అలాగే యువతలో నైపుణ్యం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఇండియాను తయారీ కేంద్రంగా మార్చుతామని అరుణ్ జైట్లీ తన ప్రసంగంలో వెల్లడించారు. ప్రతి కుటుంబంలో ఒక్కరికైనా ఉద్యోగం కలిగి ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. 2020 నాటికి పూర్తిస్థాయి విద్యుద్దీకరణకు కృషి చేస్తామన్నారు.