
ఉదయం 11 గంటలకే కేంద్ర బడ్జెట్
నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రెండోసారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఉదయాన్నే నార్త్ బ్లాక్కు చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఇందుకు సంబంధించిన కసరత్తులన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి.
గత సంవత్సరం తీవ్రమైన నడుం నొప్పి కారణంగా స్పీకర్ అనుమతితో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కూర్చునే తన బడ్జెట్ ప్రసంగాన్ని చదవడం విశేషం. ఆ తర్వాత ఆయనకు శస్త్రచికిత్స కూడా జరిగింది. దాంతో ఈసారి నిలబడి చదువుతారా.. లేదా మళ్లీ కూర్చుని చదువుతారా అనే విషయం ఆసక్తికరంగా మారింది.