
'అశోక చక్ర' గోల్డ్ కాయిన్ల అమ్మకాలు
ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకునే దేశాల్లో మనది ఒకటని అరుణ్ జైట్లీ చెప్పారు. ఏటా మనం 800-1000 టన్నుల బంగారం దిగుమతి చేసుకుంటామని, అయితే ఇది ఎక్కడా ట్రేడింగ్ కావట్లేదని అన్నారు. ఇందుకోసం గోల్డ్ డిపాజిట్ల స్థానంలో గోల్డ్ మినిమైజ్ అనే కొత్త పథకం ప్రవేశపెడతామన్నారు. బంగారాన్ని డిపాజిట్ చేసుకుంటే ఆదాయం కూడా వస్తుందని, గోల్డ్ బాండ్ కొనుగోలు చేస్తే దానికి నిర్దేశిత వడ్డీ ఇస్తామని అన్నారు.
అలాగే కొత్తగా అశోక చక్ర పేరుతో ఇండియన్ గోల్డ్ కాయిన్స్ ముద్రిస్తామని జైట్లీ చెప్పారు. దీనివల్ల విదేశాల్లో ముద్రించే బంగారానికి డిమాండ్ తగ్గుతుందన్నారు. నల్లధనాన్ని నియంత్రించడానికి క్రెడిట్, డెబిట్ కార్డుల ఉపయోగానికి మరిన్ని ప్రోత్సాహకాలు కల్పిస్తామని, క్యాష్లెస్ ఇండియా రూపొందించడానికి ఇది ఉపయోగపడుతుందని తెలిపారు.