
ప్రత్యేక హోదాపై కేంద్రం నిరాశపరిచింది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం నిరాశ పరిచిందని వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. అసలు ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం టీడీపీ, బీజేపీలేనని ఆయన మండిపడ్డారు. ఉపాధి హామీ పథకానికి నిధుల కేటాయింపు పెంచడం మాత్రం హర్షణీయమన్నారు.
రైతుల కోణంలో నుంచి ఇది నిరాశాజనకమైన బడ్జెట్ అని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విమర్శించారు. పంటబీమా, గిట్టుబాటు ధరల అంశాలకు బడ్జెట్లో ప్రాధాన్యం దక్కలేదని ఆయన అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం అత్యంత నిరాశపరిచే అంశమని అవినాష్ రెడ్డి అన్నారు. ఇక పేదరిక నిర్మూలనకు కేంద్రం ప్రత్యేకంగా తీసుకున్న చర్యలేమీ లేవని మరో ఎంపీ వరప్రసాద్ అన్నారు.