ప్రపంచ దేశాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుంటే...భారత్ ద్రవ్యోల్బణాన్ని జయించిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు.
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుంటే...భారత్ ద్రవ్యోల్బణాన్ని జయించిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. వృద్ధి రేటును త్వరలోనే రెండంకెలకు తీసుకు వెళతామన్నారు. ఇతర దేశాలతో పోల్చితే రూపాయి బలపడిందని జైట్లీ తెలిపారు. ఆర్థిక క్రమ శిక్షణ కత్తిమీద సాములాంటిదేనని ఆయన అన్నారు. రాయితీల్లోని లోపాలు సవరిస్తామే కానీ...రాయితీలు కాదని జైట్లీ పేర్కొన్నారు. రాష్ట్రాలను అభివృద్ధిలో భాగస్వాములను చేస్తామని ఆయన తెలిపారు. . పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పథకాలు రూపొందిస్తున్నామన్నారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం నాటికి భారత్ శక్తివంతమైన దేశంగా మారుతుందన్నారు.