'లక్ష' దాటితే పాన్కార్డ్ తప్పనిసరి
న్యూఢిల్లీ : ఇక నుంచి లక్ష దాటిన ఆర్థిక వ్యవహారాలకు పాన్కార్డు తప్పనిసరి కానుంది. నల్లధనాన్ని నియంత్రించటానికి కేంద్రం నడుము బిగించింది. దాంతో పాన్ కార్డు ద్వారానే లావాదేవీలు కొనసాగించాల్సి ఉంటుంది. అలాగే లక్ష దాటిన విదేశీ లావాదేవీలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు జైట్లీ తెలిపారు. అలాగే సంపద పన్ను రద్దు కాగా, రూ.కోటి ఆదాయం దాటిన వారిపై కేంద్రం 2 శాతం పన్ను వడ్డించింది.