
పార్లమెంట్ సోమవారానికి వాయిదా
న్యూఢిల్లీ : పార్లమెంట్ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. బడ్జెట్ ప్రసంగం ముగియగానే బడ్జెట్ బిల్లులను సభలో ప్రవేశపెడుతున్నట్లు కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. అనంతరం బడ్జెట్ను ఆమోదిస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహజన్ ప్రకటించారు. ఆ తర్వాత సమావేశాలను స్పీకర్ సోమవారానికి వాయిదా వేశారు.