
ఆదాయ పన్ను యథాతథం.. వేతన జీవులకు నిరాశ!
మధ్యతరగతిని, ముఖ్యంగా ఉద్యోగులను ప్రసన్నం చేసుకోడానికి ఆదాయపన్ను పరిమితిని అరుణ్ జైట్లీ మరింత పెంచుతారని అందరూ భావిస్తుంటే.. వాళ్ల ఆశల మీద ఆయన నీళ్లు చల్లారు. ఆదాయపన్ను శ్లాబులలో ఎలాంటి మార్పుచేర్పులు చేయకుండా గత సంవత్సరంలాగే యథాతథంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. దాంతో గత సంవత్సరంలో ఎలాంటి పన్ను శ్లాబులు ఉన్నాయో, ఇప్పుడు కూడా అవే వర్తిస్తాయి. అయితే వెల్త్ టాక్స్ మీద మాత్రం మరో 2 శాతం అదనపు వడ్డింపు విధించారు.