కేంద్ర కేబినెట్ శనివారం ఉదయం 10.15 గంటలకు సమావేశం కానుంది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈరోజు కేంద్ర బడ్జెట్ను ..
న్యూఢిల్లీ : కేంద్ర కేబినెట్ శనివారం ఉదయం 10.15 గంటలకు సమావేశం కానుంది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈరోజు కేంద్ర బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బడ్జెట్కు కేంద్ర మంత్రివర్గం లాంఛనప్రాయంగా ఆమోదించనుంది. మరోవైపు బడ్జెట్ను అరుణ్ జైట్లీ ఉదయం 11 గంటలకు సభలో ప్రవేశపెడతారు. కాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది రెండో బడ్జెట్. ఈసారి పలు సంస్కరణలు ప్రవేశపెడతారని అంచనా వేస్తున్నారు.