
ఉన్నత వర్గాలకు గ్యాస్ రాయితీ ఎత్తివేత
న్యూఢిల్లీ : ఉన్నత ఆదాయ వర్గాలకు గ్యాస్ రాయితీని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. అలాగే ఎంపీలు స్వచ్ఛందంగా గ్యాస్ రాయితీని వదులుకోవాలని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో సూచించారు. ఇప్పటివరకూ పేద, మధ్య తరగతి ప్రజలతో పాటు ఉన్నత వర్గాలకు కూడా కేంద్రం వంట గ్యాస్లో రాయితీ ఇస్తున్న విషయం తెలిసిందే. గ్యాస్ సిలిండర్ పై ప్రభుత్వం ఇచ్చే రాయితి ఇక నుంచి ఎంపీలు వదులుకోవాల్సిందే.