
శ్రీనగర్: కశ్మీర్‌లో రాళ్లు రువ్వుతున్న అల్లరి మూకల నుంచి తప్పించుకునే క్రమంలో భద్రతా సిబ్బంది జరిపిన కాల్పుల్లో బాలిక సహా ముగ్గురు మృతి చెందారు. ఉగ్ర నేత బుర్హాన్ వనీ వర్ధంతి సందర్భంగా కశ్మీర్‌లో చాలా ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. కుల్గామ్‌లో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారం మేరకు భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టాయి. ఈ సందర్భంగా హవూరా మిషిపోరాలో పెట్రోలింగ్ వాహనంపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. వారిని అడ్డగించేందుకు బలగాలు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అండ్లీబ్ అనే బాలికతోపాటు, షకీర్ అహ్మద్, ఇర్షాద్ అహ్మద్ చనిపోయారు.
అల్లరిమూకలపైకి బాష్పవాయువు ప్రయోగం
Comments
Please login to add a commentAdd a comment