గర్వా(జార్ఖండ్): జార్ఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించి పదిమంది ప్రాణాలు కోల్పోయారు. 25మందికి పైగా గాయాలపాలయ్యారు. బీహార్లోని ససరాం నుంచి చత్తీస్గఢ్లోని రాయగఢ్కు వెళ్లాల్సిన బస్సు సోమవారం ఉదయం 5గంటల ప్రాంతంలో జార్ఖండ్లోని గార్వా-అంబికాపూర్ రోడ్డులో అదుపుతప్పి ఓ లోయలో పడిపోయింది. దీంతో అధిక ప్రాణనష్టం చోటుచేసుకుంది. గాయాలపాలయినవారిని ఆస్పత్రికి తరలించారు.