చెన్నై : పదకొండేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన 64 ఏండ్ల వ్యక్తికి తంజావూరు కోర్టు రెండు సార్లు జీవిత ఖైదీగా శిక్ష విధిస్తూ అరుదైన తీర్పునిచ్చింది. అయితే ఈ అత్యాచార సంఘటన 2012లో జరిగింది. వివరాలు.. రామాయన్ అనే వ్యక్తి ఒరతనాడుకు చెందిన రైతు. 2012లో రామాయన్, ఓ 11ఏళ్ల బాలికకు మాయమాటలు ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దాంతో ఆ బాలిక తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే బాలికను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆ బాలికకు లైంగిక వ్యాధులు సంక్రమించినట్లు వైద్యులు నిర్ధారించారు. దాంతో పోక్సో యాక్ట్ కింద రామాయన్‌ను అరెస్ట్ చేసి, కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. ఈ కేసులో తంజావూరు మహిళా కోర్టు న్యాయమూర్తి బాలక్రిష్ణన్ నిందితుడికి రెండు సార్లు జీవిత ఖైదిగా శిక్ష విధించడంతో పాటు, రూ.2500 జరిమానా కూడా విధిస్తూ తీర్పు వెలువరించింది.
Comments
Please login to add a commentAdd a comment