life sentence
-
32 ఏళ్లనాటి కేసులో గ్యాంగ్‌స్టర్ ముఖ్తర్ అన్సారీకి జీవిత ఖైదు
ఉత్తరప్రదేశ్: 32 ఏళ్ల నాటి హత్య కేసులో ఐదుసార్లు ఎమ్మెల్యే, గ్యాంగ్‌స్టర్ ముఖ్తర్ అన్సారీకి వారణాసి కోర్టు జీవిత ఖైదు విధించింది. దాంతో పాటు లక్ష రూపాయల జరిమానాను కూడా విధించింది. అతనిపై నమోదైన 61 కేసుల్లో ఇది ఆరో కేసు. అతడు నిందితుడిగా ఉన్న మరో 20 కేసులు విచారణ దశలో ఉన్నాయి. ముఖ్తర్ అన్సారీకి గత ఏప్రిల్‌లోనే ఓ కిడ్నాప్, హత్య కేసులో పదేళ్ల జైలు శిక్ష పడింది. అతనిపై అనేక క్రిమినల్ కేసులు, భూకబ్జాలు, హత్య, దోపిడీ కేసులు నమోదయ్యాయి. అన్సారీ రాజకీయంలోకి రాకముందు 1991లోనే కాంగ్రెస్ నాయకుడి హత్య కేసులో నిందితునిగా ఉన్నాడు. 1991 ఆగష్టు 3న మాజీ ఎమ్మెల్యే అజయ్ రాజ్ సోదరుడు అవదేశ్ రాయ్‌ని దుండగులు కాల్చి చంపారు. ఈ కేసులో ముఖ్తర్ అన్సారీ, భీమ్ సింగ్, ఎమ్మెల్యే అబ్దుల్ కలీమ్‌తో సహా మరో ఇద్దరి పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఈ కేసులో ముఖ్తర్ అన్సారీని వారణాసి కోర్టు మే19 దోషిగా తేల్చి, తీర్పును రిజర్వ్ చేసింది. ఉత్తరప్రదేశ్ చరిత్రలోనే సంచలనమైన బీజేపీ నాయకుడు కృష్ణానంద్ రాయ్ హత్య కేసులోనూ అన్సారీ నిందితుడిగా ఉన్నాడు. ముఖ్తర్ అన్సారీ 1996, 2002, 2007,2012తో సహా 2017లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇతని కుమారుడు అబ్బాస్ అన్సారీ 2022లో ఎస్బీఎస్పీ తరుపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుత తీర్పుతో అవదేశ్ రాయ్ సోదరుడు అజయ్ రాజ్ సంతోషం వ్యక్తం చేశారు.'32 ఏళ్ల పోరాటానికి నేటికి దోషికి శిక్ష పడింది. ప్రభుత్వాలు మారాయి. అన్సారీ మరింత బలపడ్డారు.నేను, నా తల్లిదండ్రులు, సోదరుడు అవదేశ్ పిల్లలు ఎంతో ఓర్పుతో పోరాడాము' అని ఆయన అన్నారు. ఇదీ చదవండి:మంచు పెళ్లలు విరిగిపడి మహిళ మృతి -
జీవితమే పాఠం.. ఎవరేమన్నా లైట్ తీస్కో! నువ్వేంటో నీకే తెలుసు
-
మరణ శిక్ష కోసం మళ్లీ హత్యలు
కొలంబియా: తామొకటి తలిస్తే దైవం ఒకటి తలచినట్లయింది వారి పరిస్థితి. అమెరికాలోని దక్షిణ కరోలినా రాష్ట్రానికి చెందిన 38 ఏళ్ల డెన్వర్ సైమన్స్, 28 ఏళ్ల జాకోబ్ ఫిలిప్ప్‌లకు రెండు వేర్వేరు జంట హత్యల కేసుల్లో రెండేసి యావజ్జీవ శిక్షలు పడ్డాయి. 2010, ఆ తర్వాత జరిగిన రెండు వేర్వేరు జంట హత్యల కేసులకు సంబంధించి 2015లో ఈ ఇద్దరు నేరస్థులకు రెండేసి జీవితఖైదులు పడ్డాయి. జైలు జీవితంలో భాగంగా వారిని కొలంబియాలోని ‘కిర్కిలాండ్ కరెక్షనల్ ఇనిస్టిట్యూట్’కు పంపించారు. కనీసం పెరోల్ కూడా లభించని జైలు జీవితం పట్ల వారికి విరక్తి పుట్టింది. అందుకు ఆ ఖైదీలు ఆత్మహత్యలకు పాల్పడకుండా మరణ శిక్షలు పొందాలనుకున్నారు. పథకం ప్రకారం వారు 2017లో విలియం స్క్రగ్స్ (44), జిమ్మీ హామ్ (56), జాసన్ కెల్లీ (35), జాన్ కింగ్ (52) అనే నలుగురు తోటి ఖైదీలను హత్య చేశారు. ఆ కేసును విచారించిన రిచ్మండ్ కౌంటీ కోర్టు వారికి దిమ్మ తిరిగి పోయే తీర్పు చెప్పింది. వారికి చెరి మరో నాలుగు యావజ్జీవ కారాగార శిక్షలు విధించింది. వారికి మరణ శిక్షలు విధించరాదని, జైలు శిక్షలే విధించండని బాధితుల కుటుంబీకులు కోర్టుకు విజ్ఞప్తి చేయడంతో కోర్టు ఆ మేరకే శిక్షలు విధించింది. మరణ శిక్షల కోసమే హత్యలు చేసినట్లు డెన్వర్ సైమన్స్, జాకోబ్ ఫిలిప్ప్‌లు చెప్పిన కారణంగా బాధితుల బంధువులు వారికి మరణ శిక్ష వద్దని విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. -
‘30 ఏళ్ల తర్వాతే పెరోల్‌కు అర్హుడు’
వాషింగ్టన్ : రెండేళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మూడేళ్ల భారతీయ బాలిక షెరిన్ మాథ్యూస్ మృతి కేసులో అరెస్టయిన ఆమె దత్తత తండ్రి వెస్లీ మాథ్యూస్‌కి డల్లాస్ కోర్టు బుధవారం జీవిత ఖైదు విధించింది. 30 ఏళ్ల పాటు శిక్ష అనుభవించిన తర్వాతే అతను పెరోల్‌కు అర్హుడని తేల్చి చెప్పింది. ఓ మూడేళ్ల చిన్నారి పట్ల అమానుషంగా ప్రవర్తించినందుకు అతని మిగతా జీవితం అంతా జైలులోనే గడపాలని కోర్టు ఆదేశించింది. కేరళకు చెందిన సైనీ, వెస్లీ దంపతులు 2016లో బిహారులోని ఓ శరణాలయం నుంచి ప్రత్యేక అవసరాలున్న షెరిన్‌ను దత్తత తీసుకుని అమెరికాకు తీసుకెళ్లారు. 2017 అక్టోబరు 7న షెరిన్ కనపించకుండా పోయిందంటూ వెస్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సరిగ్గా పాలు తాగనందుకు షెరిన్పై ఆగ్రహించిన వెస్లీ పాపను తెల్లవారుజామున మూడుగంటల ప్రాంతంలో షెరిన్‌ని ఒంటరిగా ఇంటి బయట నిలబెట్టనాన్నడు. తర్వాత వచ్చి చూసేసరికి పాప కనిపించలేదని వెస్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్నారిని ఇంటి నుంచి పంపించిన 15 నిమిషాలకే తాను వెళ్లి చూశానని.. అప్పటికే పాప అక్కడ లేదని వెస్లీ చెప్పాడు. అయితే అఫిడవిట్లో మాత్రం తాను సూర్యోదయం అయ్యాక వెళ్లి చూశానని పేర్కొన్నాడు వెస్లీ. కొన్నిరోజుల తార్వత వెస్లీ ఇంటికి సమీపంలో ఓ చిన్నారి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. వైద్య పరీక్షల్లో ఆ మృతదేహం చిన్నారి షెరిన్‌దేనని తేలింది. దీంతో వెస్లీని విచారించగా.. అసలు విషయం బయటపెట్టాడు. ఘటన జరిగిన రోజు షెరిన్ పాలు తాగనని మారాం చేసిందని.. దాంతో తాను బలవంతంగా ఆమెతో పాలు తాగించానని వెస్లీ చెప్పాడు. ఈ క్రమంలో ఆమెకు వూపిరాడలేదని తెలిపాడు. కొద్ది సేపటికే ఆమె శ్వాస తీసుకోవడం ఆగిపోయిందని.. పల్స్ కూడా కొట్టుకోలేదని, దీంతో ఆమె చనిపోయినట్లు అర్థమైందని చెప్పాడు. ఆ తర్వాత మృతదేహాన్ని తానే ఇంటి నుంచి దూరంగా తీసుకెళ్లి గుర్తు పట్టరాకుండా చేసి కల్వర్టులో పడేశానని అంగీకరించాడు. -
అత్యాచారం కేసు.. అరుదైన తీర్పు
చెన్నై : పదకొండేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన 64 ఏండ్ల వ్యక్తికి తంజావూరు కోర్టు రెండు సార్లు జీవిత ఖైదీగా శిక్ష విధిస్తూ అరుదైన తీర్పునిచ్చింది. అయితే ఈ అత్యాచార సంఘటన 2012లో జరిగింది. వివరాలు.. రామాయన్ అనే వ్యక్తి ఒరతనాడుకు చెందిన రైతు. 2012లో రామాయన్, ఓ 11ఏళ్ల బాలికకు మాయమాటలు ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దాంతో ఆ బాలిక తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే బాలికను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆ బాలికకు లైంగిక వ్యాధులు సంక్రమించినట్లు వైద్యులు నిర్ధారించారు. దాంతో పోక్సో యాక్ట్ కింద రామాయన్‌ను అరెస్ట్ చేసి, కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. ఈ కేసులో తంజావూరు మహిళా కోర్టు న్యాయమూర్తి బాలక్రిష్ణన్ నిందితుడికి రెండు సార్లు జీవిత ఖైదిగా శిక్ష విధించడంతో పాటు, రూ.2500 జరిమానా కూడా విధిస్తూ తీర్పు వెలువరించింది. -
విద్యార్థినిపై లైంగికదాడి... ఇద్దరికి జీవిత ఖైదు
సాక్షి, తిరువణ్ణామలై: పాఠశాల విద్యార్థినిని కిడ్నాప్ చేసి లైంగికదాడి చేసిన కేసులో ఇద్దరికి జీవిత శిక్ష విధిస్తూ జిల్లా మహిళా కోర్టు తీర్పు ఇచ్చింది. తిరువణ్ణామలై జిల్లా త్యాగి అన్నానగర్‌కు చెందిన అశ్విన్, వినోద్‌లపై పలు కేసులున్నాయి. సారోన్ ప్రాంతానికి చెందిన టీచర్ దంపతుల కుమార్తె (16) అదే ప్రాంతంలో పదవ తరగతి చదివేది. సాయంత్రం వేళల్లో అదే ప్రాంతంలో ట్యూషన్‌కు వెళ్లి వచ్చేది. 2014 డిసెంబర్ 29న ట్యూషన్ ముగించుకొని సాయంత్రం 7 గంటలకు ఇంటికి బయలుదేరింది. ఆ సమయంలో బాలుర పాఠశాల వద్ద దాగి ఉన్న అశ్విన్, వినోద్‌లు కలిసి కత్తి చూపించి కిడ్నాప్ చేసి ఆటోలో తరలించి లైంగికదాడి చేశారు. అనంతరం ఆటోలో తీసుకొచ్చి ఇంటి సమీపంలో వదిలి పెట్టి పరారయ్యారు. ఆ సమయంలో చిన్నారి కేకలు వేయడంతో స్థానికులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించడంతో పరారయ్యారు. దీనిపై తిరువణ్ణామలై మహిళా పోలీస్ స్టేషన్లో విద్యార్థిని ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు. ఈ కేసుకు సంబంధించి తిరువణ్ణామలై మహిళా కోర్టులో విచారణ జరిగింది. ఐదు సంవత్సరాలుగా విచారణ జరిపిన న్యాయమూర్తి ఆఖరి తీర్పు వెలువరించారు. అశ్విన్, వినోద్లకు జీవిత శిక్ష, రూ: 4 వేల జరిమానా విదించారు. -
ఏడుగురికి జీవిత ఖైదు
సాక్షి, ఆదిలాబాద్: కోడలిని హత్య చేసిన కేసులో అత్తమామలతోపాటు కుటుంబ సభ్యులు ఏడుగురికి జీవిత ఖైదు విధిస్తూ ఎస్సీ, ఎస్టీ కోర్టు ప్రత్యేక జిల్లా అదనపు న్యాయమూర్తి జీవీఎన్ భరతలక్ష్మీ సంచలన తీర్పునిచ్చారు. లైజన్ అధికారి వెంకట్రావ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణంలోని పిట్టల్‌వాడ కాలనీకి చెందిన శాలినికి ఇచ్చోడ మండలం గుండివాగు గ్రామానికి చెందిన బీఎస్ఎఫ్ జవాన్ పవార్ మస్నాజితో 2013లో వివాహం జరిగింది. 2015లో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. పెళ్లి సమయంలో పుట్టింటి వారు ఇచ్చిన వస్తువుల కోసం శాలిని, ఆమె తల్లి కానిస్టేబుల్ సర్దార్‌సింగ్‌తో కలిసి శాలిని అత్తగారింటికి వెళ్లారు. తమ కుమారుడి మృతికి కోడలే కారణమంటూ 2015 ఏప్రిల్ 13న శాలినిపై అత్తమామలు పవార్ లక్ష్మణ్, మతురబాయిలతోపాటు బావలు రమేశ్, సంజీవ్, బాలాజీ, తోడికోడళ్లు సులోచన, తానాబాయిలు కర్రలతో దాడి చేసి కిరోసిన్ పోసి నిప్పంటించారు. దీంతో శాలిని అక్కడికక్కడే మృతిచెందింది. ఆమె వెంట వెళ్లిన కానిస్టేబుల్‌ను బంధించి దాడికి పాల్పడ్డారు. శాలిని తల్లి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించడంతో నిందితులను అరెస్టు చేశారు. దాడిపై కానిస్టేబుల్ దరఖాస్తు ఇవ్వడంతో అప్పటి ఎస్సై సంజీవ్ కేసు నమోదు చేశారు. సీఐ మోహన్ చార్జీషీటు దాఖలు చేయగా, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మల్లికార్జున్ 24 మంది సాక్షులను విచారించారు. నేరం రుజువైనందున ఈ కేసుకు సంబంధించి సోమవారం ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయమూర్తి భరతలక్ష్మీ ఏడుగురు నేరస్తులకు జీవిత ఖైదు శిక్షతోపాటు ఒక్కొక్కరికి రూ.20,500 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు. -
ఏడాది పిల్లాడు హత్య చేశాడట..!
కైరో: ఏడాది వయసున్న పిల్లాడు హత్యాయత్నం, హత్య చేశాడట.. అంతేనా ఆస్తులను ధ్వంసం చేసి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించాడు. పోలీసు అధికారులను కూడా బెదిరించాడు. వినడానికి వింతగా ఉన్నా ఈజిప్టు మిలటరీ కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఈ కేసులో అహ్మద్ మన్సూర్ కొరాని (ప్రస్తుత వయసు నాలుగేళ్లు) అనే బాలుడ్ని దోషిగా నిర్ధారిస్తూ జీవిత శిక్ష విధించింది. దీనిపై ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో పొరపాటు జరిగిందంటూ ఈజిప్ట్ అధికారులు లెంపలేసుకున్నారు. బాలుడి తండ్రి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమకు అన్యాయం జరిగిందంటూ గుండెలు బాదుకున్నాడు. తన కొడుకును తన వద్ద నుంచి తీసుకెళ్లవద్దని, న్యాయం చేయాలని అధికారులను వేడుకున్నాడు. 'నేను పేదవాడిని. నిస్సహాయుడిని. ఎవరికీ హాని చేయలేదు. నా కొడుకును నా వద్ద నుంచి తీసుకెళ్లవద్దు' అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ వార్త వెలుగులోకి వచ్చాక ఈజిప్టు ప్రజల నుంచి నిరసన వ్యక్తమైంది. డిఫెన్స్ న్యాయవాది మహ్మద్ అబు కఫ్ మాట్లాడుతూ.. కొరాని నేరం చేయలేదని నిరూపించడానికి అతని బర్త్ సర్టిఫికెట్‌ను సాక్ష్యంగా కోర్టులో ప్రవేశపెట్టామని, అయితే జడ్జిలు పరిగణనలోకి తీసుకోలేదని చెప్పారు. కొరాని తండ్రి ఇంటర్వ్యూ ప్రసారమైన మరుసటి రోజు మిలటరీ ప్రతినిధి మాట్లాడుతూ.. తప్పు జరిగినట్టు అంగీకరించారు. బాలుడి పేరును పొరపాటుగా నిందితుల జాబితాలో చేర్చినట్టు చెప్పారు. మూడేళ్ల క్రితం కైరోకు 70 కిలో మీటర్ల దూరంలోని ఫయోమ్ ప్రావిన్స్‌లో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ఈ ఘటనకు సంబంధించి 116 మందిని నిందితులుగా చేర్చారు. ఆ సమయంలో బాలుడి తండ్రిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి నాలుగు నెలలు కస్టడీలో ఉంచారు. ఆ తర్వాత కోర్టు నిర్దోషిగా ప్రకటిస్తూ విడుదల చేసింది. -
ఓ ట్వీట్.. ఉగ్రవాద దంపతులకు జీవిత ఖైదు
లండన్‌లో ఉగ్రవాద దాడికి కుట్రపన్నిన దంపతులకు జీవిత ఖైదు విధించారు. లండన్ రవాణ వ్యవస్థపై ఉగ్రవాదదాడి జరిగి పదేళ్లు కావస్తున్న సందర్భంగా మహ్మద్ రెహ్మాన్ (25), సనా అహ్మద్ ఖాన్ (24) ఆత్మాహుతి దాడికి పాల్పడేందుకు కుట్ర పన్నినట్టు కోర్టు నిర్ధారించింది. వీరిద్దరినీ దోషులుగా ప్రకటించిన కోర్టు రెహ్మాన్‌కు 27 ఏళ్లు, సనాకు 25 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధించినట్టు బ్రిటీష్ మీడియా వెల్లడించింది. రెహ్మాన్ ట్విట్టర్ ఎకౌంట్లో పోస్ట్ చేసిన ట్వీట్ల ఆధారంగా భద్రత అధికారులు గత మేలో ఈ దంపతులను అదుపులోకి తీసుకున్నారు. లండన్‌లో బాంబు పేల్చడానికి తగిన ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయని సలహా కోరుతూ ఓ ట్వీట్ చేశాడు. బాంబులను ఎలా పేల్చాలి, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ గురించి ఆన్లైన్లో సెర్చి చేసినట్టు అధికారులు కనుగొన్నారు. భద్రతాధికారులు రెహ్మాన్‌ను అరెస్ట్ చేశాక వారి ఇంట్లో సోదాలు చేశారు. బాంబు తయారీ పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. రెహ్మాన్, సనా ఇంటర్నెట్లో ఉగ్రవాద కార్యకలాపాల గురించి తెలుసుకునేవారని, సోషల్ మీడియా ద్వారా ఉగ్రవాద భావజాలాన్ని పంచుకునేవారని ఓ ఉన్నతాధికారి చెప్పారు.