ఉగ్రవాదమే అతిపెద్ద సవాల్
సార్క్ విదేశాంగ మంత్రుల సమావేశంలో సుష్మాస్వరాజ్
కఠ్మాండు: దక్షిణాసియా ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ ఉగ్రవాదమేనని భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు. ఉగ్ర భూతాన్ని తరిమేందుకు సార్క్ దేశాలు ఉమ్మడి చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. దక్షిణాసియా శాంతి, సౌభాగ్యాలతో వర్ధిల్లేందుకు దేశాల మధ్య అనుసంధానం కీలకమన్నారు. నేపాల్ రాజధాని కఠ్మాండులో మంగళవారం జరిగిన సార్క్‌దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో సుష్మ ప్రసంగించారు.
అఫ్ఘానిస్థాన్‌లో రెండు రోజుల కిందట ఆత్మాహుతి దాడికి పాల్పడి 50 మందికిపైగా హతమార్చడం దక్షిణాసియాకు ఉగ్రవాదమే అతిపెద్ద సవాల్ అని నిరూపించిందన్నారు. కాగా, ఈ సందర్భంగా సుష్మాస్వరాజ్...పాకిస్తాన్ జాతీయ భద్రత సలహాదారు సర్తాజ్ అజీజ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.