
పెళ్లిరోజు రాత్రే నగలతో వధువు పరార్
కాన్పూర్: వినయవిధేయతలతో మెలుగుతూ ఓ యువకుడితో మూడు ముళ్లు వేయించుకున్న యువతి.. కొద్ది గంటల్లోనే బంగారు నగలతో ఉడాయించింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ జిల్లా నజిరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
సరోజనీనగర్‌కు చెందిన శ్యాంబాబు అనే యువకుడు, దేవరియా గ్రామానికి చెందిన యువతిని ఈ నెల 23వ తేదీన పెళ్లి చేసుకున్నాడు. అదే రోజు రాత్రి నుంచి పెళ్లి కూతురు కనిపించకుండా పోయింది. వధువరులకు చెందిన రూ.2.50 లక్షల విలువైన నగలు కూడా మాయమయ్యాయి. ఆమె సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోంది. దీంతో కంగుతిన్న వరుడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.