ఆ ముగ్గురు సౌదీ బాధితులకు విముక్తి | The three Indian workers reached Trivandrum from Saudi Arabia | Sakshi
Sakshi News home page

ఆ ముగ్గురు సౌదీ బాధితులకు విముక్తి

Published Sat, Dec 26 2015 8:46 AM | Last Updated on Sun, Sep 3 2017 2:37 PM

ఆ ముగ్గురు సౌదీ బాధితులకు విముక్తి

ఆ ముగ్గురు సౌదీ బాధితులకు విముక్తి

తిరువనంతపురం: సౌది అరేబియాలో యజమాని చేతిలో చిత్రహింసలకు గురైన ముగ్గురు భారతీయులు ఎట్టకేలకు శనివారం ఉదయం భారత్కు చేరుకున్నారు. త్రివేండ్రం విమానాశ్రయానికి చేరుకున్న వారిని చూసి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.

సౌదీ అరేబియాలో ముగ్గురు భారతీయులపై యజమాని విచక్షణారహితంగా దాడిచేసిన వీడియో కలకలం రేపిన సంగతి తెలిసిందే.  యజమాని తమను వేధిస్తున్నాడని, కాపాడాలంటూ ఈ వీడియోను బాధితులు వాట్సప్‌లో కుటుంబ సభ్యులకు పంపారు. కేరళలోని హరిపాద్ పట్టణానికి చెందిన వీరిని ఎలక్ట్రిషీయన్ ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసి సౌదీ అరేబియాకు తీసుకెళ్లారు. తీరా అక్కడకు వెళ్లాక ఇటుక బట్టీల్లో పనిచేయాలని వారిని వేధించారు.

వీరిని భారత్కు తీసుకురావడానికి విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్తో పాటు కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాంది చొరవ తీసుకున్నారు. భారత్ నుండి వెళ్లిన ఎంతో మంది బాధితులు ఇలా మోసపోయి ఇబ్బందులకు గురౌతున్నా ఆర్థిక కారణాల వలన తిరిగిరాలేని స్థితిలో చిక్కుకుంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement