
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నై ఈసీఆర్ రోడ్డులో నివసిస్తున్న ప్రపంచ బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ ఇంట్లో దొంగలుపడి రూ.20 లక్షల బంగారు నగలు, నగదు దోచుకెళ్లారు. ఉత్తరాది రాష్ట్రానికి చెందిన సునీల్‌కుమార్ (51) తన కుటుంబంతో ఈసీఆర్ రోడ్డులోని విలాసవంతమైన గృహ సముదాయంలో నివసిస్తున్నాడు. చెన్నై తరమణిలోని ప్రపంచ బ్యాంకు బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఇతను ఈనెల 1న ఇంటికి తాళం వేసి భార్య అనితతో కలిసి హైదరాబాద్ వెళ్లి ఆదివారం రాత్రి తిరిగొచ్చాడు. వంట గది కిటీకీ అద్దం పగులగొట్టి ఉండడాన్ని గమనించి దొంగలు పడ్డారని గ్రహించాడు. ఇంటి బీరువాలోని రూ.20 లక్షల విలువైన 90 సవర్ల బంగారు నగలు, రూ.80 వేల నగదు దొంగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించాడు.
Comments
Please login to add a commentAdd a comment