
’బుల్లెట్లు ప్రయోగించి వెళ్లగొట్టండి’
బరేలీ: పాకిస్థాన్ కు వెళ్లిపోవాలనుకున్న వారిని మనదేశం నుంచి పంపించివేయాలని విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) అగ్రనేత ప్రవీణ్ తొగాడియా అన్నారు. ఇలాంటి వారు మనదేశం విడిచిపెట్టకపోతే తుపాకులతో కాల్చాలని ఆయన వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో విలేకరులతో మాట్లాడుతూ... ‘పాకిస్థాన్ కు వెళ్లాలనుకునేవారిని పంపిచేయండి. ఒకవేళ మన దేశం విడిచి వెళ్లేందుకు ఒప్పుకోకపోతే బుల్లెట్లు ప్రయోగించి వీరిని పొరుగు దేశానికి పంపించాల’ని తొగాడియా పేర్కొన్నారు.
కశ్మీర్ అల్లర్లపై ప్రధాని నరేంద్ర మోదీ మెతకవైఖరి అవలంభిస్తున్నారని పరోక్షంగా విమర్శించారు. ‘ ప్రసంగాలతో దేశాన్ని కాపాడలేరు. తుపాకీ బుల్లెట్లు ఉపయోగించడం ద్వారానే దేశానికి రక్షించగలమ’ని తొగాడియా అన్నారు.