మూడు విమానాలను నడిపిన మహిళలు | three planes operate womens on international women's day | Sakshi
Sakshi News home page

మూడు విమానాలను నడిపిన మహిళలు

Published Wed, Mar 8 2017 7:29 PM | Last Updated on Tue, Mar 3 2020 7:07 PM

three planes operate womens on international women's day

చెన్నై: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం ఉదయం చెన్నై నుంచి మూడు ఎయిర్‌ ఇండియా విమానాలను పూర్తిగా మహిళలే నడిపారు. చెన్నై విమానాశ్రయం నుంచి ఉదయం 6.20 గంటలకు ఢిల్లీ వెళ్లే ఎయిర్‌ ఇండియా విమానాన్ని పైలెట్‌ దీప, మహిళా సిబ్బంది, మహిళా ఇంజనీర్లు మొత్తం ఏడుగురు  నడిపారు. ఈ విమానంలో మొత్తం 172 మంది ప్రయాణించారు. మహిళా ప్రయాణికులకు రోజా పుష్పగుచ్ఛాలను ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఉదయం 6.50 గంటలకు సింగపూర్‌ వెళ్లే ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానాన్ని పైలెట్‌ కవిత, ఎనిమిది మంది మహిళలు నడిపారు. అదేవిధంగా మధ్యాహ్నం 12.40 గంటలకు చెన్నైకు వచ్చిన ఎయిర్‌ ఇండియా విమానాన్ని పూర్తిగా మహిళలే నడపడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement