రెండు రైళ్లు ఢీ.. 100 మందికి గాయాలు | Train collision in Haryana leaves 1 dead, 100 injured | Sakshi
Sakshi News home page

రెండు రైళ్లు ఢీ.. 100 మందికి గాయాలు

Published Tue, Dec 8 2015 11:01 AM | Last Updated on Sun, Sep 3 2017 1:42 PM

రెండు రైళ్లు ఢీ.. 100 మందికి గాయాలు

రెండు రైళ్లు ఢీ.. 100 మందికి గాయాలు

చండీగఢ్: హరియాణాలో మంగళవారం ఉదయం రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు డ్రైవర్లు మరణించగా, 100 మంది ప్రయాణికులు గాయపడ్డారు.

ముంబై నుంచి హరిద్వార్ వెళ్తున్న లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్, ఓ ఈఎంయూ రైలు.. హరియాణాలోని పాల్వాల్ సమీపంలో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు అక్కడిక్కడే మరణించారు. ఈ వార్త తెలిసినవెంటనే సహాయ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. వైద్యులు క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. దట్టమైన పొగమంచు వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. ఈ మార్గం గుండా వెళ్లాల్సిన ఇతర రైళ్లు ఆగిపోయాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement