train collision
-
తీవ్ర విషాదం.. ఎదురెదురుగా ఢీకొన్న రైళ్లు (ఫొటోలు)
-
రైలు ఢీకొని ఆర్మీ జవాన్ దుర్మరణం
వజ్రపుకొత్తూరు: శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని పూండి రైల్వేస్టేషన్ పరిధి చరణ్‌దాస్‌పురం లెవెల్ క్రాసింగ్‌కు సమీపంలో శుక్రవారం ఓ రైలు ఢీకొని ఆర్మీ జవాన్ పాలిన మోహనరావు(43) మృతి చెందారు. ఆయన ఆర్మీలో జేసీవో (జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్) హోదాలో పనిచేస్తున్నారు. నెల రోజుల కిందటే సెలవుపై గ్రామానికి వచ్చారు. జీఆర్పీ పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. జిల్లాలోని నందిగాం మండలం ప్రతాప విశ్వనాథపురం (షరాబు కొత్తూరు) గ్రామానికి చెందిన పాలిన ఎర్రయ్య, అన్నపూర్ణ దంపతుల రెండో కుమారుడు మోహనరావు ఆర్మీలో జేసీవో హోదాలో పనిచేస్తున్నారు. నెల రోజుల కిందట సెలవుపై ఇంటికి వచ్చారు. గురువారం రాత్రి ఆయన భార్య అరుణకు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో పూండి బస్టాండ్ రోడ్డులో ఉన్న మెడికల్ షాపునకు వెళ్లారు. రైలు పట్టాలు దాటుతుండగా డౌన్‌లైన్‌లో నౌపడ నుంచి పలాస వైపు వస్తున్న ఓ సూపర్ ఫాస్ట్ రైలు ఆయనను ఢీకొనడంతో అక్కడికక్కడే చనిపోయారు. విషయాన్ని పలాస జీఆర్పీ ఎస్ఐ ఎస్కే షరీఫ్ ధ్రువీకరించారు. మృతుడికి భార్య అరుణ, ఇద్దరు కుమారులు కార్తీక్, యశ్వంత్ ఉన్నారు. మోహనరావు రెండు దశాబ్దాలుగా భారత సైన్యంలో పనిచేస్తున్నారు. మృతుని స్వగ్రామం షరాబు కొత్తూరులో అంత్యక్రియలు నిర్వహించారు. విశాఖపట్నం నుంచి వచ్చిన నాయక్ సుబేదార్ సంజయ్ ప్రకాష్, హవల్దార్ భాస్కర్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. -
ఇక రైళ్లు ఢీకొనవు !
కోల్‌కతా: రైలు ప్రయాణాలు సురక్షితం చేసే దిశగా ముందడుగు పడింది. రైళ్లు ఒకదానికొకటి ఢీకొనకుండా నిరోధించే ఎలక్ట్రానిక్ రైల్వే ఇంటర్‌లాకింగ్ వ్యవస్థకు ఐఐటీ ఖరగ్‌పూర్ శాస్త్రవేత్తలు కొత్త పరికరాన్ని కనుగొన్నారు. ఈ కొత్త వ్యవస్థను ఐఐటీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం, డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ సంస్థ(ఆర్డీఎస్ఓ), రైల్వే సర్వీస్ ఇంప్రూవ్మెంట్ గ్రూపు(ఎస్ఐజీ) కలిసి అభివృద్ధి చేశాయి. ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన ప్రొఫెసర్ పల్లబ్ దాస్‌గుప్తా మాట్లాడుతూ... ఇంటర్‌లాకింగ్ వ్యవస్థలోని అనువర్తిత దోషాల వల్లే ప్రమాదాలు జరుగుతాయని, కొత్త పరికరం వాటిని తగ్గిస్తుందని తెలిపారు. ప్రతిపాదిత విధానంలో యార్డు లేవుట్ ప్రాతిపదికన భద్రతా ప్రమాణాల జాబితాను రూపొందించి తరువాత వాటిని బ్యాంక్ ఎండ్ మోడల్ చెకింగ్ విధానంలో పరిశీలిస్తారని చెప్పారు. ఈ పరికరాన్ని ఇప్పటికే పలు రైలు యార్డుల్లో విజయవంతంగా ప్రయోగించారని వెల్లడించారు. ట్రాఫిక్ ప్రణాళికలు, అత్యవసర పరిస్థితులకు ప్రత్యామ్నాయాల కోసం ఈ ప్రాజెక్టును విస్తరించేందుకు అపార అవకాశాశాలున్నాయని పరిశోధకులు తెలిపారు. -
రైలు కిందపడి వ్యక్తి మృతి
రైలు కిందపడి ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా బాలనగర్ సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న జహంగీర్(35) అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా మతిస్థిమితం కోల్పోయి తిరుగుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం రైలు కిందపడి మృతిచెందాడు. -
రెండు రైళ్లు ఢీ.. 100 మందికి గాయాలు
-
రెండు రైళ్లు ఢీ.. 100 మందికి గాయాలు
చండీగఢ్: హరియాణాలో మంగళవారం ఉదయం రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు డ్రైవర్లు మరణించగా, 100 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ముంబై నుంచి హరిద్వార్ వెళ్తున్న లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్, ఓ ఈఎంయూ రైలు.. హరియాణాలోని పాల్వాల్ సమీపంలో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు అక్కడిక్కడే మరణించారు. ఈ వార్త తెలిసినవెంటనే సహాయ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. వైద్యులు క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. దట్టమైన పొగమంచు వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. ఈ మార్గం గుండా వెళ్లాల్సిన ఇతర రైళ్లు ఆగిపోయాయి. -
రెండు రైళ్లు ఢీ : ఇద్దరు మృతి
లాగోస్ : నైజీరియా రాజధాని లాగోస్‌లో రెండు రైళ్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. ఈ మేరకు ఉన్నతాధికారులు సోమవారం వెల్లడించారు. సదరు ప్రయాణికులు ఇద్దరు రైలుపై భాగంలో అక్రమంగా ఎక్కి ప్రయాణిస్తున్నారని చెప్పారు. ఈ మేరకు లాగోస్ రైల్వే జిల్లా మేనేజర్ తెలిపారు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. -
రెండు రైళ్లు ఢీ : 20 మందికిపైగా గాయాలు
దక్షిణ ఫ్రాన్స్‌లో రెండు రైళ్లు ఢీ కొన్నాయి. ఆ ఘటనలో 20 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. పావు బేయాన్ లైన్లో 178 మంది ప్రయాణికులతో వెళ్తున్న రైలు ట్రాక్‌పై 70 ప్రయాణికులతో ఆగి ఉన్న టీఈఆర్ ట్రైన్‌ను ఢీ కొట్టింది. దాంతో రైల్వే అధికారులు వెంటనే స్పందించిన సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. రెండు రైళ్లు ఢీ కొన్న సంఘటనపై శాఖ పరమైన విచారణకు ఆదేశించినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ మేరకు ప్రముఖ వార్త సంస్థ బీబీసీ వెల్లడించింది. -
ఈజిప్టులో రైలు ప్రమాదం; 29 మంది మృతి
ఈజిప్టు రాజధాని కైరో సమీపంలో సోమవారం ఉదయం జరిగిన రైలు ప్రమాదంలో 29 మంది మరణించగా, మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. బెనీ సుయెఫ్ నుంచి గీజాకు వెళ్తున్న సరుకుల రవాణా రైలు పలు వాహనాలను ఢీకొట్టడంతో ఈ సంఘటన జరిగింది. కైరోకు 40 సమీపంలోని డాషుర్ పట్టణం వద్ద రైలు తొలుత ఓ మినీ బస్సును ఢీ కొట్టింది. ఆ తర్వాత ఓ ట్రక్‌ను ఇతర వాహనాలను ఢీ కొంది. దీంతో భారీ ప్రాణ నష్టం జరిగింది. బాధితుల్ని సమీప ఆస్పత్రికి తరలించారు. రైలు డ్రైవర్, అతని సహాయకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.