రెండు రైళ్లు ఢీ : 20 మందికిపైగా గాయాలు | Dozens injured in French train collision | Sakshi
Sakshi News home page

రెండు రైళ్లు ఢీ : 20 మందికిపైగా గాయాలు

Published Fri, Jul 18 2014 9:09 AM | Last Updated on Sat, Sep 2 2017 10:29 AM

Dozens injured in French train collision

దక్షిణ ఫ్రాన్స్లో రెండు రైళ్లు ఢీ కొన్నాయి. ఆ ఘటనలో 20 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. పావు బేయాన్ లైన్లో 178 మంది ప్రయాణికులతో వెళ్తున్న రైలు ట్రాక్పై 70 ప్రయాణికులతో ఆగి ఉన్న టీఈఆర్ ట్రైన్ను ఢీ కొట్టింది. దాంతో రైల్వే అధికారులు వెంటనే స్పందించిన సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

 

వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. రెండు రైళ్లు ఢీ కొన్న సంఘటనపై శాఖ పరమైన విచారణకు ఆదేశించినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ మేరకు ప్రముఖ వార్త సంస్థ బీబీసీ వెల్లడించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement