Dozens injured
-
UP Hathras Stampede: హత్రాస్‌లో తీవ్ర విషాదం.. తొక్కిసలాటలో 100 మందికిపైగా మృతి (ఫొటోలు)
-
బాంబులతో దద్దరిల్లిన కాబూల్
-
కాబూల్ జంటపేలుళ్లలో 61మంది మృతి
-
కాబూల్ జంటపేలుళ్లలో 10మంది మృతి
-
కాబూల్ జంటపేలుళ్లలో 61మంది మృతి
కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. శనివారం జరిగిన జంట బాంబు పేలుళ్లలో 61మంది దుర్మరణం చెందగా, 200మందికి పైగా గాయపడ్డారు. ఈ మేరకు ఆ దేశ వైద్య, ఆరోగ్యశాఖ ధ్రువీకరించింది. స్థానిక మీడియా కథనం ప్రకారం కాబూల్‌లోని దహ్మజంగ్ సర్కిల్ సమీపంలో రద్దీగా ఉండే ప్రాంతంలో పేలుళ్లు సంభవించినట్లు సమాచారం. కాగా వందల మంది షియా ముస్లింలు ఓ చోట చేరి నిరసన ప్రదర్శన చేస్తున్న ప్రాంతంలో బాంబులు పేలినట్లు పోలీసులు వెల్లడించారు. మూడు సూసైడ్ బాంబర్స్ పేల్చుకున్నట్లు తెలిపారు. మరోవైపు రంగంలోకి దిగిన పోలీసులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా పేలుళ్లకు పాల్పడింది తామేనని ఐఎస్ఐఎస్ ప్రకటించింది. -
రెండు రైళ్లు ఢీ : 20 మందికిపైగా గాయాలు
దక్షిణ ఫ్రాన్స్‌లో రెండు రైళ్లు ఢీ కొన్నాయి. ఆ ఘటనలో 20 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. పావు బేయాన్ లైన్లో 178 మంది ప్రయాణికులతో వెళ్తున్న రైలు ట్రాక్‌పై 70 ప్రయాణికులతో ఆగి ఉన్న టీఈఆర్ ట్రైన్‌ను ఢీ కొట్టింది. దాంతో రైల్వే అధికారులు వెంటనే స్పందించిన సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. రెండు రైళ్లు ఢీ కొన్న సంఘటనపై శాఖ పరమైన విచారణకు ఆదేశించినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ మేరకు ప్రముఖ వార్త సంస్థ బీబీసీ వెల్లడించింది.