లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను అరెస్టు చేశారని, త్వరలోనే భారతదేశానికి కూడా తీసుకురావచ్చని కథనాలు రాగానే సోషల్ మీడియా ఒక్కసారిగా అటువైపు దృష్టిసారించింది. ట్విట్టర్‌లో భారతదేశ వ్యాప్తంగా టాప్ ట్రెండింగ్ టాపిక్ విజయ్ మాల్యానే అయ్యింది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇది ఐదో టాప్ ట్రెండింగ్ టాపిక్‌గా నిలిచింది. ట్విట్టర్ జనాలు తమకు అలవాటైన రీతిలో పూర్తిస్థాయిలో రెచ్చిపోయారు. మాల్యా మీద విపరీతంగా సెటైర్లు వేశారు. గత సంవత్సరం మార్చి నెలలో సరిగ్గా ఐపీఎల్ సీజన్ ప్రారంభం కావడానికి ముందు భారతదేశం వదిలి వెళ్లిపోయిన మాల్యా, ఇప్పుడు మళ్లీ ఐపీఎల్ సీజన్ మొదలు కావడంతో ఆ మ్యాచ్‌లు చూసేందుకే వస్తున్నాడని కొందరు అన్నారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఒకప్పుడు యజమాని కావడంతో.. ఆర్సీబీ జట్టు పెర్ఫార్మెన్సు ఇక్కడే కాదు, లండన్‌లో కూడా బాగోలేదని మరికొందరు చెప్పారు.
ఇక దర్శకుడు శిరీష్ కుందర్ అయితే.. 'బ్యాంక్ చోర్' సినిమా ప్రమోషన్ కోసమే మాల్యాను భారతదేశానికి తీసుకొస్తున్నారంటూ సెటైర్ వేశాడు. 'బార్' (మద్యం తాగే బార్) నుంచి 'బార్' (జైలు ఊచల) వెనక్కి వెళ్తున్నారని మరొకరు వ్యాఖ్యానించారు. కింగ్ ఆఫ్ బ్యాడ్ టైమ్స్ అని లిక్కర్ కింగ్‌ను అభివర్ణించారు. ఇలా వరుసపెట్టి ట్వీట్ల మీద ట్వీట్లు మాల్యా మీద వెల్లువెత్తాయి. ఇక మాల్యా అరెస్టుతో.. గత 16 నెలలుగా తమకు పెండింగులో ఉన్న జీతాలు ఇప్పటికైనా వస్తాయేమోనని మాజీ ఉద్యోగులు కొందరు ఆశాభావం వ్యక్తం చేశారు. సోను నిగమ్ అన్న మాటలను సోను సూద్‌కు అంటగట్టారని, స్నాప్‌చాట్ బదులు స్నాప్‌డీల్ బుక్కయిందని గుర్తుచేస్తూ.. ఇప్పుడు మురళీ విజయ్ సేఫ్‌గానే ఉన్నాడా అంటూ సెటైర్ వేశారు.
according to some reports he want to watch live IPL dats y he got himself arrested..