జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సీఆర్పీఎఫ్ దళాలే లక్ష్యంగా కాల్పులు జరపడంతో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. అనంతనాగ్ జిల్లాలోని శ్రీనగర్ - జమ్ము జాతీయ రహదారిపై వెళ్తున్న సీఆర్పీఎఫ్ వాహనం మీద వాళ్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.
లేవ్ డోరా ప్రాంతంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఇద్దరు జవాన్లు గాయపడ్డారని, వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు తరలించామని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఆ ప్రాంతంలో వాహనాల రక్షణ కోసం నియమించిన సీఆర్పీఎఫ్ పెట్రోలింగ్ బృందాలపైనే ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
కాశ్మీరీ ఉగ్రవాదుల దాడి: సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలు
Published Sat, Nov 8 2014 7:38 PM | Last Updated on Sat, Aug 11 2018 9:02 PM
Advertisement
Advertisement