
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం నియమించిన కమిటీ దగ్గర నమోదు కాకుండా కొన్ని విశ్వవిద్యాలయాలు జంతువులపై ప్రయోగాలు నిర్వహించడంపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రయోగాల నిమిత్తం జంతువులను కోయడాన్ని 2014లోనే నిషేధించిన విషయాన్ని గుర్తుచేసింది. ఈ మేరకు యూజీసీ కార్యదర్శి పీకే ఠాకూర్ అన్ని విశ్వవిద్యాలయాల వైస్‌చాన్స్‌లర్లకు లేఖ రాశారు. విశ్వవిద్యాలయాలతో పాటు అనుబంధ కళాశాలల్లో జంతువులను చంపటాన్ని నిలువరించాలని ఆదేశించారు.
ప్రయోగాల కోసం జంతువులను కోయడానికి, వాటి పునరుత్పత్తికి కంట్రోల్ అండ్ సూపర్‌విజన్ ఆఫ్ ఎక్స్‌పెరిమెంట్ ఆన్ యానిమల్స్(సీపీసీఎస్‌ఈఏ) కమిటీ వద్ద వర్సిటీ లు నమోదుకావాల్సి ఉంటుంది. ఈ కమిటీ కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో పనిచేస్తుంది. లైఫ్ సైన్సెస్, జంతుశాస్త్రం కోర్సులు నిర్వహించే విద్యాసంస్థలు నిబంధనల మేరకు జంతువులపై ప్రయోగాల కోసం సీపీసీఎస్‌ఈఏ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment