ఎమినెన్స్ హోదా కోరే విద్యా సంస్థల నుంచి యూజీసీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
సాక్షి, న్యూఢిల్లీ: ‘విశిష్ట’(ఎమినెన్స్) హోదా కోరే విద్యా సంస్థల నుంచి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. భారత విద్యా సంస్థలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దటానికి 20 ప్రపంచస్థాయి సంస్థల (ప్రభుత్వ రంగంలో 10, ప్రైవేట్ రంగంలో 10)ను ఏర్పాటుచేయాలని మానవ వనరుల శాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఇలా ఏర్పడబోయే ప్రభుత్వ రంగ విద్యా సంస్థల్లో కేంద్రం పదేళ్ల కాలానికి రూ.10 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. సాధారణ గ్రాంట్లకు ఈ నిధులు అదనం. వీటి ఏర్పాటుకు ఆసక్తి ఉన్న సంస్థలు 90 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలని యూజీసీ సూచించింది.