ఇండోర్ : పశువులకు గుర్తింపు నెంబర్ ఏంటని అనుకుంటున్నారా? మీరు చదువుతున్నది నిజమే.. దేశంలోని జనాలకు ఆధార్‌లాగే పశువులకు కూడా యూనిక్ ఐడెంటిటీ(యూఐడీ) నంబర్ జారీ చేస్తోంది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డ్ పథకం కింద ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పశువుల రక్షణతోపాటు, పాల ఉత్పత్తి పెంచేందుకు ఈ విధానాన్ని ప్రారంభించారు.
‘రాష్ర్టంలో 90 లక్షల పశువులున్నాయి. మొదటి దశలో భాగంగా 40 లక్షల పశువులకు యూఐడీ ట్యాగింగ్ చేపడతాం. ఇప్పటివరకు 2.5 లక్షల ఆవులు, గేదెలకు ట్యాగింగ్ పూర్తయింది. రెండో దశలో మిగిలిన వాటికి ట్యాగింగ్ చేపడతాం. యూఐడీ కేటాయించేటప్పుడు పశువు ఏ రకానికి చెందినది, వయస్సు వంటి వివరాలను సేకరిస్తున్నాం. తర్వాత పశువులకు కేటాయించిన యూఐడీ నంబర్‌ని యాజమాని ఆధార్‌కి లింక్ చేయనుబోతున్నాం. మధ్యప్రదేశ్ పాల ఉత్పత్తిలో దేశంలోనే మూడో స్థానంలో ఉంది. ఈ విధానం పశువులు సంతతివృద్ధికి ఉపయోగకరంగా ఉంటుంది. దీని ద్వారా అక్రమ కొనుగోలు, అమ్మకాలను నియత్రించడమే కాకుండా, స్మగ్లింగ్‌ని ఆరికట్టవచ్చు’ అని అధికారులు తెలుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment